Site icon NTV Telugu

Tamannaah Bhatia : ప్రేమ.. దోమ.. వద్దు.. వెండితెర ముద్దు

Thamana

Thamana

మిల్కీ బ్యూటీ తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసింది. లస్ట్ స్టోరీస్ 2తో స్టార్టైన లవ్ స్టోరీకి రీసెంట్లీ ఎండ్ కార్డ్ పండింది. ఈ ఫోర్ ఇయర్స్ లవ్ బర్డ్స్‌లా చెట్టా పట్టాలేసుకుని తిరిగారు తమ్ము-విజయ్. ఇక పెళ్లి చేసుకుని ఇల్లాలి పోస్ట్ ఇవ్వమని మిల్కీ బ్యూటీ అడిగితే.. కెరీర్, మూవీస్ అంటూ కాకమ్మ కబుర్లు చెప్పాడు ఎంసీఎ విలన్. దీంతో చిర్రెత్తుకొచ్చిన తమన్నా ఫో అంటూ ఛీ కొట్టింది. దీంతో ఎవరి దారి వారు వెతుక్కున్నారు.

Also Read : Samantha : శుభం ప్రీమియర్ టాక్.. కొచం అటు.. కాస్త ఇటు..

ప్రేమ డిజాస్టర్ కావడంతో  కెరీర్ పై ఫోకస్ చేసింది. ఏవో క్రిప్టిక్ పోస్టులు చేస్తూ కొంచెం తనకు తాను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసింది. అదే టైంలో ఓదెల 2 , రైడ్ 2లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. నషా సాంగ్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది తమ్ము. వీటి రిజల్ట్ ఎలా ఉన్నామేడమ్ మాత్రం తన ఇవ్వాల్సినంత స్టఫ్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే బ్రేకప్ బాధ నుండి కాస్త బయటపడుతోంది క్యూటీ. విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత మళ్లీ కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది తమన్నా. ఇలా కాన్సట్రేషన్ చేసిందో లేదో వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తోంది అమ్మడు. అజయ్ దేవగన్ సరసన రేంజర్ ఎప్పుడో కమిట్ కాగా, ఇప్పుడు మరో త్రీ ఫిల్మ్స్ ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. నో ఎంట్రీ2తో పాటు రోహిత్ శెట్టి జాన్ అబ్రహం కాంబోలో తెరకెక్కుతోన్న అన్ టైటిల్ట్ మూవీలో నటిస్తోంది తమన్నా. ఇక రీసెంట్లీ సిద్ధార్థ్ మల్హోత్రా సరసన వివాన్ చేస్తోంది. ఇలా వరుస సినిమాలకు సైన్ చేస్తూ రేస్ లోకి దూసుకొస్తోంది మిల్కి బ్యూటీ.

Exit mobile version