NTV Telugu Site icon

Tapsee Pannu: లగ్జరీ కారు కొన్న సొట్టబుగ్గల సుందరి.. రేటు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

Tapsee

Tapsee

Tapsee Pannu: ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ తాప్సీ. తన సొట్ట బుగ్గలతో మొదటి సినిమాతోనే కుర్రకారును తన వలలో వేసుకుని అభిమానులుగా మార్చేసుకుంది. ఇక తెలుగులో కొన్ని సినిమాలు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ భామ ఇక్కడ అనుకున్న విజయం దక్కక బాలీవుడ్ లో పాగా వేసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. ఇక తాప్సీ సినిమాల ద్వారా ఎంత ఫేమస్ అయిందో తెలియదు గానీ వివాదాల ద్వారా మాత్రం మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ముఖ్యంగా కంగనాతో ఆమె గొడవ పడిన తీరుకి ఎంతోమంది ఫిదా అయిపోయారు. ఇక బాలీవుడ్ కు వెళ్ళాకా.. టాలీవుడ్ డైరెక్టర్స్ పై, హీరోలపై అమ్మడు సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇక్కడ అభిమానులు కూడా ఆమెపై దుమ్మెత్తిపోశారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సొట్ట బుగ్గల సుందరి ఒక లగ్జరీ కారును సొంతం చేసుకుంది.

Rules Ranjan: మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తే చాలదు.. స్పీడు పెంచు కిరణ్ బ్రో

ఇప్పటికే తాప్సీ కార్ల లిస్టులో చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులోకి మెర్సిడేస్ బెంజ్ జిఎల్ఎస్ 600 వచ్చి చేరింది. దీని ధర అక్షరాల రూ 3.15 కోట్లు అని తెలుస్తుంది. ఈ కారులో అత్యాధునిక ఫీచర్స్ ఉండడంతో పాటు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లో కూడా న్యూ టెక్నాలజీ ఉందని కంపెనీ వర్గాలు చెప్తున్నాయి. ఇకపోతే ఇలాంటి కారును ఈ ముద్దుగుమ్మ ఇలాంటి సమయంలో కొనడం ఆశ్చర్యమే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇంత ధర పెట్టి స్టార్ హీరోయిన్ సైతం ఇలాంటి కారును కొనలేకపోయారు. అలాంటిది తాప్సీ లగ్జరీ కారును కొనడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తాప్సీ చేతిలో భారీ చిత్రాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలతో ఈ భామ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Show comments