Site icon NTV Telugu

Taapsee: ‘మిషన్ ఇంపాజిబుల్’ రిలీజ్ డేట్ లాక్!

taapsee

taapsee

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్‌లో స్వరూప్ ఆర్.ఎస్.జె. ద‌ర్శ‌క‌త్వంలో తాప్సీ పన్ను న‌టిస్తున్న చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. ఇటీవలే ఈ సినిమాలోని ‘ఏమిటీ గాలం’ పాటను మేకర్స్ విడుదల చేశారు. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ కేవలం స్టార్ హీరోలతోనే కాకుండా కంటెంట్ ప్రధానమైన చిత్రాలనూ నిర్మిస్తోంది. ఆ మధ్య వచ్చిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో దర్శకుడిగా చక్కని గుర్తింపుతో పాటు విజయాన్ని పొందిన స్వరూప్ కు ఇది రెండో సినిమా. మార్క్ కె రాబిన్ సంగీత సమకర్చిన ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు కాగా, ఎన్ ఎం పాషా అసోసియేట్ ప్రొడ్యూసర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలియచేస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Exit mobile version