Site icon NTV Telugu

Taali Trailer: ట్రాన్స్ జెండర్ గా అదరగొట్టిన సుస్మితా సేన్..

Taali

Taali

Taali Trailer: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్ ఆర్య వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ సిరీస్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సిరీస్ తరువాత సుస్మితా ఒక స్ట్రాంగ్ కథతో వస్తుంది. ఇది కథ అనడం కన్నా బయోపిక్ అని చెప్పొచ్చు. ఇండియాలోనే మొట్ట మొదటి ఎలక్షన్ అంబాసిడర్ అయిన శ్రీగౌరీ సావంత్‌ జీవిత కథగా తెరకెక్కిన సిరీస్ తాలి. జాతీయ అవార్డు దర్శకుడు రవి జాదవ్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జియో సినిమా లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. ట్రాన్స్ జెండర్ శ్రీగౌరీ సావంత్‌ గా సుస్మితా కనిపించనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సిరీస్ యొక్క ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. చిన్నతనం నుంచి శ్రీగౌరీ సావంత్‌ ఎదుర్కున్న అవమానాలను అన్ని ఇందులో చూపించారు.

Annie: హీరోయిన్ గా రాజన్న చైల్డ్ ఆర్టిస్ట్.. రిలీజ్ కి రెడీ అవుతున్న ‘తికమక తాండ’

ట్రాన్స్ జెండర్ గా బతకడం తప్పుకాదని.. కోర్టులో పోరాడి లీగల్ గా తమ ఉనికిని చాటిన శ్రీగౌరీ సావంత్‌ గా సుస్మితా నటన అదిరిపోయింది. ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో సుస్మిత నటన, హావభావాలు సిరీస్ మొత్తానికి హైలైట్ గా నిలిచాయి. ఆ పెద్ద బొట్టు.. ఆమె డ్రెస్సింగ్ అంతా శ్రీగౌరీ సావంత్‌ ను గుర్తుచేస్తాయి. ఇక ఇందులో కొన్ని డైలాగ్స్ మనుషులను హత్తుకుంటాయి. ఈ సిరీస్ కోసం సుస్మితా చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్ ఈవెంట్ లో సుస్మితా మాట్లాడుతూ.. ” కథ వినగానే నేను వెంటనే ఓకే చెప్పేసాను. శ్రీగౌరీ సావంత్‌ మారడానికి నాకు ఆరు నెలలు సమయం పట్టింది. ఆమె ఎంతో గొప్ప వ్యక్తి ఆమెతో కలిసి కొన్నిరోజులు గడపడం నాకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నా” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ సిరీస్ అన్ని భాషల్లో ఆగస్టు 15 న జియో సినిమాస్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సిరీస్ తో ఈ మాజీ విశ్వ సుందరి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=gBFczsrs0_c

Exit mobile version