Site icon NTV Telugu

Swathi Deekshith: రూ. 30 కోట్ల ఇల్లు కబ్జా.. నటి స్వాతి దీక్షిత్ పై కేసు

Swathi

Swathi

Swathi Deekshith: నటి, బిగ్ బాస్ ఫేమ్ స్వాతి దీక్షిత్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. జూబ్లీహిల్స్ లో రూ.30 కోట్ల ఇంటి కబ్జా కోసం ప్రయత్నిస్తున్న నిందితుల్లో స్వాతి కూడా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అసలు విషయం ఏంటంటే.. అమెరికాకు చెందిన ఒక మహిళకు చెందిన ఇల్లు.. లీజు కేసు కోర్టులో నడుస్తోంది. ఆ కేసు విషయంగా స్వాతికి, ఆమెకు ఏడాదిగా వివాదం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఎవరులేని సమయంలో కొంతమంది దుండగులతో పాటు స్వాతి దీక్షిత్, చింతల ప్రశాంత్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి, వాచ్ మెన్ పై దుర్భాషలాడి.. వెంటనే ఇల్లు ఖాళీ చేయమని, లేకపోతే చంపేస్తామని బెదిరించినట్లు సమాచారం. వెంటనే.. వాచ్ మెన్.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వడంతో ఈ విషయం బయటపడింది. ఈ ఘటనపై ఐపీసీ 147, 148, 447, 427, 504, 506 red with.147 కిం కేసు నమోదు చేశారు. ఇక స్వాతితో పాటు మరో 20 మందిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Sudigali Sudheer: రష్మీతో పెళ్లి.. బాంబ్ పేల్చిన సుధీర్

ఇక స్వాతి దీక్షిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించి మెప్పించింది. ఆ తరువాత 2012లో బెంగాలీలో తోర్ నామ్ సినిమాలో తొలిసారి హీరోయిన్ గా నటించింది. ఇక తెలుగులో దెయ్యం, జంప్ జిలాని, గమ్మత్తు లాంటి సినిమాలో కనిపించింది. బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొంది. హౌస్ నుంచి బయటికి వచ్చాకా .. ఈ భామ ఎక్కడా కనిపించింది లేదు.

Exit mobile version