Site icon NTV Telugu

SVP : ‘సర్కార్ వారి పాట’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

sarkaru vari patat

pre release event

సరిలేరు నీకెవ్వరు తరువాత ‘ సర్కార్ వాటి పాట’ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. థమన్ అందించిన మ్యూజిక్, బీజీఎంకు కూడా అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే ‘కళావతి’ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది. దీంతో పాటు ‘ మ మ మషేషా’ సాంగ్ కూడా దుమ్ము రేపుతోంది. ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా సర్కార్ వారి పాట రిలీజ్ కాబోతోంది. మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. పరుశురామ్ దర్మకత్వం వహించాడు.

ఇదిలా ఉంటే సర్కార్ వారి పాటకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్  చెప్పింది. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, ఎయిర్ కండిషన్, సాధారణ థియేటర్లలో రూ. 30 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈనెల 12 నుంచి 7 రోజుల పాటు సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. మరోవైైపు ఈనెల 12 నుంచి 18 వరకు ఉదయం 7 నుంచి అర్థరాత్రి 1 వరకు 5వ షో నడుపుకునేందుకు అనుమతి ఇచ్చింది.

Exit mobile version