Site icon NTV Telugu

Sushmita Sen: 56 ఏళ్ళ వయస్సు ఉన్న మాజీ ఐపీఎల్‌ చైర్మన్‌తో సుష్మితా సేన్‌ పెళ్లి

Lalith

Lalith

బాలీవుడ్ బ్యూటీ, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ మరోసారి ప్రేమలో పడింది. ఇప్పటికే రెండు సార్లు ప్రేమలో పడి, పెళ్లి వరకు వెళ్లిన ఈ మాజీ విశ్వసుందరి ముచ్చటగా మూడో ప్రియుడిని పరిచయం చేసింది. మాజీ ఐపీఎల్‌ చైర్మన్‌ లలిత్‌ మోదీ తన జీవిత భాగస్వామి అబీటు తేల్చి చెప్పింది. లలిత్ మోదీ వయస్సు 56.. సుస్మితా వయస్సు 46. దాదాపు పదేళ్ల గ్యాప్ ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ విషయాన్ని లలిత్ ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులతో పంచుకున్నాడు. “మాల్దీవులు పర్యటనను ముగించుకొని కుటుంబంతో కలిసి లండన్ వచ్చాం. కుటుంబంలో నా జీవిత భాగస్వామి సుస్మితా సేన్ ను కూడా కలుపుతున్నాను. ఆమెతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని రాసుకొచ్చాడు.

ఇక మరో ట్వీట్ లో తాము ఇంకా డేటింగ్ లో ఉన్నామని, ఒక్కరోజులోనే ఒకరితో ఒకరు ప్రేమలో పడిపోయామంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక సుస్మితా సేన్ ప్రేమ వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పుకొనవసరం లేదు. పాక్‌ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌తో మొదలైన సుస్మితా ప్రేమ ప్రయాణం కొన్నిరోజులు బాగానే గడిచినా తరువాత విబేధాల వలన విడిపోయారు. ఇక దీని తరువాత తనకన్నా చిన్నవాడైన ప్రముఖ మోడల్‌ రోహ్‌మన్‌తో లివింగ్ రిలేషన్ మొదలుపెట్టింది. చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ జంట ముచ్చటగా మూడేళ్లు కూడా లేకుండా విడిపోయారు. ఇక ఇప్పుడు తన కంటే పదేళ్లు పెద్దవాడైన లలిత్ తో ప్రేమ వ్యవహారం మొదలుపెట్టింది. ఇది ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి అంటున్నారు నెటిజన్లు.

Exit mobile version