మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ బ్రేకప్ స్టోరీ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అమ్మడికి లవ్ స్టోరీలు కొత్తకాదు.. ఇలా బ్రేకప్ లు కొత్తకాదు. అయితే ఈసారి ఈ లవ్ స్టోరీ గురించి మాట్లాడుకోవడంలో కొద్దిగా ప్రత్యేకత ఉంది. వయసులో తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన కుర్రహీరోతో సుస్మిత లివింగ్ రిలేషన్ లో ఉండడం అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. బాయ్‌ఫ్రెండ్ కశ్మీరి మోడల్, బాలీవుడ్ నటుడు రోహ్మాన్ షాల్‌తో తాను సహజీవనం చేస్తున్నట్లు నిర్మొహమాటంగా చెప్పిన సుస్మితా.. తన బ్రేకప్ విషయం మాత్రం ఎందుకు చెప్పడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏడాది నుంచి ఈ లవ్ బర్డ్స్ మధ్య విభేదాలు తలెత్తాయని, అవి తగ్గకపోవడంతో రోహ్మాన్ షాల్ తో తన బంధాన్ని తెంపుకొని ఇంట్లోనుంచి అతడిని పంపించేసినట్లు బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇక ఇటీవల సుస్మితా సోషల్ మీడియాలో పెట్టె పోస్ట్లు సైతం ఆమె బాధలో ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకప్ బాధ నుంచి బయటపడడానికి అమ్మడు ఎక్కువగా జిమ్ లోయ గడుపుతుందని తెలుస్తోంది. రోజూ వర్క్ అవుట్స్ చేస్తున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్న సుస్మితా.. ఈ విషయమై కనీసం హింట్ కూడా ఇవ్వకుండా మేనేజ్ చేస్తోంది. ఇక వీరి బ్రేకప్ స్టోరీ తెలుసుకున్న నెటిజన్లు కాస్త అసహనానికి గురవుతున్నారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారేమో అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అని బాధపడుతున్నారు. మరి ఈ బ్రేకప్ గురించి ఈ మాజీ మిస్ యూనివర్స్ ఏమంటుందో చూడాలి.
