బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం మరో సారి హాట్ టాపిక్ గా మారింది. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై అతని అక్క శ్వేత సింగ్ కిర్తి చేసిన కొత్త ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. శ్వేత తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, “సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు, అతనిని చంపారు” అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఆమె చెప్పిన ప్రకారం..
Also Read : Tejaswini: కమర్షియల్ యాడ్ లో.. బాలయ్య కూతురు సర్ప్రైజ్ ఎంట్రీ
సుశాంత్ బెడ్, ఫ్యాన్ మధ్య ఉన్న దూరం చూశా, అతను ఉరేసుకుని చనిపోయే అవకాశం లేదు.. అంతేకాదు సుశాంత్ మెడపై దుపట్టా గుర్తు కాకుండా ఒక చిన్న చెయిన్ ముద్ర మాత్రమే కనిపించిందని తెలిపింది. అలాగే సుశాంత్ చనిపోయిన తర్వాత తాను అమెరికాలో ఒక మానసిక నిపుణుడిని, అలాగే ముంబైలో మరో నిపుణుడిని సంప్రదించానని, ఇద్దరు అతని మరణం సహజం కాదు, ఇద్దరు కలిసి హత్య చేశారని చెప్పారు అని వెల్లడించింది. “ నేను సంప్రదించిన వాళ్లు ఒకరికొకరు తెలియకపోయినా, ఒకేలా చెప్పారు. అది నాకు షాక్ ఇచ్చింది” అని శ్వేత పేర్కొంది. తన తమ్ముడి కెరీర్లో వేగంగా ఎదుగుతున్న సమయంలో కొందరు అసూయతో ఇలా చేతబడి చేయించారని, 2020 మార్చి తర్వాత సుశాంత్ బతకడని కాల్స్ కూడా వచ్చాయని ఆమె వెల్లడించింది.
అయితే అప్పట్లో తమ కుటుంబం వాటిని నమ్మలేదని, కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ సందేహాలను రేకెత్తించాయని చెప్పింది. ఇక సుశాంత్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి గురించి కూడా శ్వేత స్పందించింది. రియా ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో “నువ్వు చాలా వేగంగా ఎగురుతున్నావ్.. నీ రెక్కలు కత్తిరించాల్సిందే” అనే భావంతో పోస్ట్ చేయగా, సుశాంత్ దాన్ని లైక్ చేయడం తనకు వింతగా అనిపించిందని ఆమె తెలిపింది. దేశవ్యాప్తంగా పెద్ద షాక్ ఇచ్చింది ఈ ఘటనలో చివరికి “ఇది ఆత్మహత్యే” అని తేల్చాయి. కానీ ఇప్పుడు సుశాంత్ అక్క శ్వేత చేసిన ఈ కొత్త ఆరోపణలు మరోసారి ఆ కేసును ప్రజల ముందు తెచ్చాయి.