Suriya- Jyothika: కోలీవుడ్ అడోరబుల్ కపుల్ సూర్య- జ్యోతిక ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ జంట పెళ్లి అయిన దగ్గరనుంచి ఇప్పటివరకు వేరు కాపురం పెట్టలేదు. ఉమ్మడి కుటుంబాలానే అందరూ కలిసి ఉన్నారు. అయితే తాజాగా సూర్య- జ్యోతిక కుటుంబం.. వేరుపడినట్లు వార్తలు వస్తున్నాయి. సూర్య తండ్రి శివ కుమార్, తమ్ముడు కార్తీలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఎన్నోసార్లు కార్తీ.. తాము కలిసి ఉండడానికి కారణం మా వదిన జ్యోతికనే అని చెప్పుకొచ్చాడు. కానీ, ఈసారి ఈ విబేధాలకు కారణం కూడా జ్యోతికనే అని వార్తలు వస్తున్నాయి. కొన్ని కుటుంబ కలహాల కారణంగా సూర్య.. తన భార్య పిల్లలతో కలిసి ముంబైలో మకాం పెట్టాడట. గత కొన్ని రోజుల క్రితం ముంబైలో కొత్త ఇల్లు కొనుగోలు చేసిన సూర్య ఈ మధ్యనే ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యారట. మొదటి నుంచి సూర్య, జ్యోతికను వివాహం చేసుకోవడం తండ్రి శివ కుమార్ కు నచ్చలేదని, కొడుకు ఇష్టాన్ని కాదనలేక పెళ్లి చేసాడని మరో నటుడు బైల్వాన్ రంగనాధన్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా మరిన్ని విషయాలను కూడా మాట్లాడాడు.
NTR: ఎన్టీఆర్ బామ్మర్దిని రెడీ చేస్తున్న పవన్ ప్రొడ్యూసర్..
పెళ్ళికి ముందు శివకుమార్.. జ్యోతికకు ఒక కండిషన్ పెట్టాడట. పెళ్లి తరువాత ఆమె సినిమాల్లో నటించకూడదని చెప్పడంతో జ్యోతిక కొన్నేళ్లు సినిమాలకు దూరం అయ్యిందని, ఇక ఇప్పుడు మళ్లీ ఆమె సినిమాలు చేయడం మొదలుపెట్టేసరికి మామగారు జీర్ణించుకోలేక పోతున్నారట. ఆ విషయంలో ఇంట్లో విబేధాలు రావడం.. తండ్రికి మద్దతుగా సూర్య నిలువలేకపోవడంతో అందరూ దూరంగా ఉండడమే మంచిదని అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ముంబై నుంచి.. చెన్నైకు సూర్య తిరుగుతున్నాడని, త్వరలోనే పూర్తిగా ముంబైలోనే సెటిల్ అవుతాడని కోలీవుడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇంకోపక్క కార్తీ సైతం అన్నకు సపోర్ట్ గా లేడని టాక్. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.