Surya B Positive: ఆసక్తికరంగా “సూర్య బి పాజిటివ్” టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాళీ క్రాఫ్ట్స్, నిర్మలం డ్రామాస్ బ్యానర్స్ పై సుబ్బా మాధవరపు రచనా దర్శకత్వంలో అరుణ్ కుమార్ పర్వతనేని డిఓపిగా గ్యాని సంగీతాన్ని అందించిన చిత్రం సూర్య బి పాజిటివ్. చరణ్ పీసర్ల హీరోగా,
యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్స్ గా రోహిత్ సత్యన్, సుజాత దీక్షిత్, చంద్ర గౌతమ్, సత్య, సురభి లలిత, గీతన్ సాయి తేజ తదితరులు కీలకపాత్రను పోషించిన ఈ చిత్రానికి మురళీకృష్ణ మన్యం ఎడిటర్ గా పని చేయగా రాంబాబు గోసాల లిరిక్స్ అందించారు. బ్రిజేష్ తంగి, చరణ్ పీసర్ల చిత్ర డైలాగులు లిఖించారు. దండోరా చిత్ర దర్శకుడు మురళికాంత్ దేవసోత్, కిష్కింధపురి చిత్ర దర్శకులు కౌశిక్ పెగల్లపాటి ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమం వారి చేతుల మీదుగా “సూర్య బి పాజిటివ్” అనే ఈ చిత్ర టీజర్ లాంచ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ… “ఒక కొత్త సినిమా చేసేటప్పుడు ఆ సినిమా వెనుక ఎంత కష్టం ఉంటుందో తెలిసి, ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నప్పటికీ ఆ కష్టాన్ని మర్చిపోకుండా మరొక కొత్త సినిమా వస్తున్నప్పుడు వారిని ప్రోత్సహించే దశగా మా సినిమాకు సపోర్టుగా వచ్చిన దర్శకులు కౌశిక్ పెగల్లపాటి గారికి, మురళీకాంత్ దేవసోత్ గారికి రుణపడి ఉంటాను. మా దర్శకులు అమెరికాలో ఉంటారు. ఈ సినిమా దర్శకత్వం చేసేటప్పుడు అక్కడ ఉద్యోగాన్ని అలాగే ఇక్కడే సినిమాను పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి చేశారు. మా నిర్మాత ఆయన ఎన్ని సంవత్సరాల కష్టాన్ని మాపై నమ్మకంతో ఈ సినిమాపై పెట్టారు. నా పేరు చరణ్, నేను ఒక నటుడుని. నన్ను నేను ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటున్నాను. మా సినిమా టీజర్ మీకు నచ్చుతుంది. నటుడిగా గుర్తింపు పొందాలంటే అర్హత ఉండాలని నేను భావిస్తున్నాను. గతంలో ఎంతో పెద్దవారికి అటువంటి అర్హతను ప్రేక్షకులు ఇచ్చారు. నేను ఆ అర్హతను అడుగుతున్నాను. నేను ఇప్పటికి మూడు సినిమాలలో చేశా, కొన్ని అనివార్య కారణాల వలన ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇది నాలుగవ సినిమా, ఈ సినిమా ద్వారా నన్ను ప్రేక్షకులు అభినందిస్తారని కోరుకుంటున్నాను. నేను ఎప్పటికీ ఆగిపోను, ముందుకు వెళ్ళిపోతాను. నన్ను అవమానించిన పర్లేదు, భవిష్యత్తులో సత్కారంగా మారుతుందని నమ్ముతున్నాను. నాకు నటుడిగా అర్హత ఇవ్వమని మరోసారి కోరుకుంటున్నాను” అన్నారు.
Also Read
- Shwetha Menon: మలయాళ 'అమ్మ'లో సంక్షోభం.. అధ్యక్షురాలు సహా మొత్తం కార్యవర్గం రాజీనామా!
- Sukumar: డైరెక్టర్ సుకుమార్‌ను కలిసిన ప్రియదర్శి మూవీ టీమ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
- Sai Durga Tej: ‘మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది’.. హనుమాన్ 3Dపై సుప్రీం హీరో క్రేజీ రివ్యూ!
- OG 2: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. స్టార్ట్ అయిన ‘OG 2’ స్క్రిప్ట్ డిస్కషన్స్!
తాజావార్తలు
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
-
Shwetha Menon: మలయాళ ‘అమ్మ’లో సంక్షోభం.. అధ్యక్షురాలు సహా మొత్తం కార్యవర్గం రాజీనామా!
-
Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
-
JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
-
Donald Trump: “తీవ్రమైన దాడి చేస్తాం”.. చర్చల వేళ ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!