కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి సౌత్ మొత్తం మంచి మార్కెట్ ఉంది, ఈ మార్కెట్ ని పాన్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చెయ్యడానికి దర్శకుడు శివతో కలిసి ‘సూర్య 42’ అనే సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ కూడా అనౌన్స్ చెయ్యని ఈ మూవీలో దిశా పఠాని హీరోయిన్ గా నటిస్తోంది. గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. #suriya42 అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి సూర్య ఫాన్స్ ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. ఎలాంటి అప్డేట్ లేకుండా ఈ ట్రెండ్ ఎందుకు చేస్తున్నారా అని చూస్తే ‘సూర్య 42’ ప్రొడ్యూసర్స్ స్టూడియో గ్రీన్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి సూర్య ఉన్న 17 సెకండ్ల వీడియో ఒకటి రిలీజ్ అయ్యింది.
ఇందులో సూర్య ఇంటెన్స్ వర్కౌట్ చేస్తున్నాడు. ఎప్పుడూ సాలిడ్ గా, ఫిట్ గా ఉండే సూర్యకి మంచి టోన్డ్ ఫిజిక్ ఉంటుంది. అంత మంచి ఫిజిక్ మైంటైన్ చేసే సూర్య కూడా బాడీ పెంచుతున్నాడు అంటే ‘సూర్య 42’ సినిమాలో సూర్య ఎలా కనిపించబోతున్నాడో అర్ధం చేసుకోవచ్చు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీతో సూర్య పాన్ ఇండియా లెవల్లో హిట్ కొడతాడని కోలీవుడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే అత్యధిక బడ్జట్ తో రూపొందుతున్న ఈ సూర్య 42 మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ లాంటివి సూర్య 42 సినిమా నుంచి బయటకి రాలేదు కానీ ఈ మూవీలో సూర్య లుక్, బెస్ట్ లుక్ టిల్ డేట్ అనే రేంజులో ఉంటుందని సమాచారం.
The Man of Hardwork and Dedication ❤️❤️❤️❤️ @Suriya_offl Anna ❤️❤️❤️#Suriya42 🔥🔥🔥🔥🔥 pic.twitter.com/p6ZtEv1A6N
— Studio Green (@StudioGreen2) February 11, 2023
