Site icon NTV Telugu

Suriya: మరోసారి తన గొప్పమనసు చాటుకున్న స్టార్ హీరో

Suriya

Suriya

హీరోలు అంటే సినిమాల్లో మంచి చేసేవారు కాదు.. తమలను ప్రేమించే అభిమానులు కష్టాల్లో ఉంటే మేము అండగా ఉన్నామని వారికి ధైర్యం చెప్పేవారు.. అదృష్టం మన టాలీవుడ్ హీరోలందరూ అలాంటి ధైర్యాన్ని అభిమానులకు ఇస్తున్నారు. అభిమానులకు ఏమైనా కష్టం వచ్చినా.. వారికి అండగా ఉంటూ రియల్ హీరోలు అని అనిపించుకుంటున్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సూర్య రీల్ లోనే కాదు రియల్ గా కూడా గొప్ప హీరో.. ఆయన చేసే సేవా కార్యక్రమాలకు అంతే ఉండదు. చిన్న పిల్లలకు అగారం ఫౌండేషన్ ద్వారా చదువు చెప్పిస్తున్నాడు. ఇక స్వచ్ఛంద సంస్థలకు డొనేషన్లు సూర్య ఇవ్వడం తెలిసిందే.. ఇక తాజాగా సూర్య తన ఉదారతను చూపించాడు. తన అభిమాని రోడ్డుప్రమాదంలో మృతి చెందితే స్వయంగా ఆయనే వెళ్లి కుటుంబాన్ని ఓదార్చాడు. అనంతరం కుటుంబాకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఇటీవల సూర్య అభిమాని జగదీషన్ (27) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

ఇక ఈ విషయం తెలుసుకున్న సూర్య.. ఇటీవల వారి కుటుంబాన్ని పరమార్శించాడు. సూర్యను చూడగానే ఆ కుటుంబం భోరున విలపించింది. చిన్న వయస్సులోనే జగదీశ్ మృతితో ఆ కుటుంబం దిక్కులేనిదిగా మారిపోయింది. అయితే జగదీశ్ లేని లోటును తాను తీర్చలేనని కానీ వారి బరువు బాధ్యతలన్నిటిని మోస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారి పిల్లల చదువుల దగ్గర నుంచి వైద్యం వరకు అన్ని సూర్య ఫౌండేషన్ తరుపున చేయిస్తానని మాట ఇచ్చినట్లు సమాచారం. దీంతో సూర్య గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అలాంటి మంచి వ్యక్తికి అభిమానులం అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మరీ చెప్తుండడం విశేషం.

Exit mobile version