Karuppu : కరుప్పు బ్లాక్ బస్టర్.. భారీ ధర పలుకుతున్న సూర్య తెలుగు సినిమా థియేట్రికల్ రైట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చాలా కాలం తర్వాత కరుప్పు సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా రూ. 250 కోట్ల గ్రాస్ మార్క్ దాటి స్టడీగా దూసుకెళ్తోంది. తెలుగులో వీరభద్రుడుగా వచ్చిన ఈ దాదాపు 25 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఆంధ్ర ఏరియాలో (రాయలసీమ కాకుండా) ఈ సినిమాను మూడు కోట్ల రేషియోలో అడ్వాన్స్‌ల రూపంలో థియేట్రికల్ రైట్స్ ఇస్తే, అది కాస్తా ఇప్పుడు ఆరు కోట్ల వరకు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సూర్య స్ట్రయిట్ సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కు సంబంధించిన బిజినెస్ లెక్కలు కూడా ఒక్కసారిగా మారిపోయాయి.
‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండటం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఈ క్రేజీ కాంబినేషన్ కారణంగానే బిజినెస్ పరంగా ఈ ప్రాజెక్ట్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ చిత్రం ఆంధ్రా రైట్స్ (రాయలసీమ మినహాయించి) సొంతం చేసుకునేందుకు బయ్యర్స్ పోటీ పడుతున్నారు. వినిపిస్తున్న సమాచారం మేరకు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కు రూ. 10 నుంచి రూ. 12 కోట్ల రూపాయల NRA రేటు చెబుతున్నట్లు తెలుస్తోంది. వెంకీ అట్లూరి మార్కెట్ వాల్యూ, సూర్యకు తెలుగులో ఉన్న క్రేజ్ తోడవ్వడంతో ఈ స్థాయి రేటు పలకుతుంది. అయితే సినిమా ఏ మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంటే పెట్టుబడి రికవరీ చేయడం కస్టమేమి కాదని ట్రేడ్ వర్గలలో వినిపిస్తున్న మాట.
Also Read
తాజావార్తలు
-
Karuppu : కరుప్పు బ్లాక్ బస్టర్.. భారీ ధర పలుకుతున్న సూర్య తెలుగు సినిమా థియేట్రికల్ రైట్స్..
-
RCB vs GT Qualifier 1: విరాట్ కోహ్లీ పార్ట్నర్ మారనున్నాడా?.. ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ కీలక వ్యాఖ్యలు!
-
Minister Narayana: అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం.. మంత్రి నారాయణ ఫైర్
-
Karuppu Success Meet: ‘కరుప్పు 2’పై సూర్య బిగ్ హింట్..
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?