NTV Telugu Site icon

Suriya: విజయకాంత్ ఆరోగ్యం.. సూర్య ట్వీట్ వైరల్

Suriya

Suriya

Suriya: కోలీవుడ్ నటుడు, డీఎండీకే నేత విజయకాంత్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.అనారోగ్యం కారణంగా నవంబర్‌ 18న చెన్నైలోని మయత్‌ ఆస్పత్రిలో విజయకాంత్ చేరారు. అప్పటినుంచి ఆయన చికిత్స అందుకుంటూనే ఉన్నారు. ఇక ఈ మద్యంలో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని, వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇక గత వారం నుంచి ఆయన మృతి చెందినట్లు కూడా వార్తలు పుట్టించారు. అయితే అందులో నిజం లేదని, విజయకాంత్ బానే ఉన్నారని.. ఆయన భార్య ప్రేమలత ఒక వీడియో ద్వారా చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో తరువాత పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం విజయకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయమే ఆయన ఫోటోను కూడా కుటుంబ సభ్యులు రిలీజ్ చేశారు. ఇక విజయకాంత్ త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కోరుకుంటున్నారు.

Bandla Ganesh: బ్లేడ్ అన్నందుకు ఐదేళ్లు ట్రోల్ చేశారు.. ఇప్పుడు అనరే

తాజాగా సూర్య.. విజయకాంత్ ఆరోగ్యంపై ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. ” అన్నన్ విజయకాంత్ కోలుకోవాలని ప్రార్థించే కోట్లాది హృదయాల్లో నేనూ ఒకడిని.
కోట్లాది ప్రజల ప్రార్థనలు తప్పకుండా నెరవేరుతాయి. ఆ ప్రార్థనలు ఆయనను త్వరగా కోలుకునేలా చేస్తాయి” అని చెప్పుకొచ్చాడు. ఇక సూర్య సినిమాల విషయానికొస్తే.. కంగువ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది కాకుండా సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాలతో సూర్య ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Show comments