Site icon NTV Telugu

Suriya: ఆయనతో కలిసి చేసిన ఏ పనిని నేను మర్చిపోలేను.. కెప్టెన్ మృతిపై సూర్య ఎమోషనల్

Suria

Suria

Suriya: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకున్న విషయం తెల్సిందే. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్‌ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కరోనా సోకడం వలనే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఆయన మృతితో కోలీవుడ్ మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీ మొట్ట తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. విజయకాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే విశాల్.. వెక్కి వెక్కి ఏడుస్తూ విజయకాంత్ మృతిని తట్టుకోలేకపోతున్నట్లు తెలిపాడు. ఇక తాజాగా సూర్య సైతం ఎమోషనల్ అవుతూ వీడియో షేర్ చేశాడు.

” తనతో కలిసి పనిచేసిన, మాట్లాడిన, తిన్న రోజులు మరువలేనివి..అతను ఎవరికీ నో చెప్పలేదు. కడకోడి ప్రజలకు సహాయం చేస్తూ విప్లవ కళాకారుడిగా ఎదిగిన అన్నన్ విజయకాంత్ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను” అని ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక సూర్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఆకాశం నీ హద్దురా డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాలతో సూర్య ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Exit mobile version