Suriya: ఆయనతో కలిసి చేసిన ఏ పనిని నేను మర్చిపోలేను.. కెప్టెన్ మృతిపై సూర్య ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకున్న విషయం తెల్సిందే. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కరోనా సోకడం వలనే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఆయన మృతితో కోలీవుడ్ మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీ మొట్ట తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. విజయకాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే విశాల్.. వెక్కి వెక్కి ఏడుస్తూ విజయకాంత్ మృతిని తట్టుకోలేకపోతున్నట్లు తెలిపాడు. ఇక తాజాగా సూర్య సైతం ఎమోషనల్ అవుతూ వీడియో షేర్ చేశాడు.
” తనతో కలిసి పనిచేసిన, మాట్లాడిన, తిన్న రోజులు మరువలేనివి..అతను ఎవరికీ నో చెప్పలేదు. కడకోడి ప్రజలకు సహాయం చేస్తూ విప్లవ కళాకారుడిగా ఎదిగిన అన్నన్ విజయకాంత్ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను” అని ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక సూర్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఆకాశం నీ హద్దురా డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాలతో సూర్య ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
Also Read
அவருடன் பணியாற்றிய, பேசிப்பழகிய, சேர்ந்து சாப்பிட்ட நாட்கள் மறக்க முடியாதவை…
யார் என்ன கேட்டாலும் இல்லை என்று அவர் சொன்னதே இல்லை..
கடைக்கோடி மக்கள் வரை உதவி செய்து புரட்சிக் கலைஞனாக உயர்ந்த அண்ணன் விஜயகாந்த் அவர்களின் மறைவிற்கு ஆழ்ந்த இரங்கல்!! pic.twitter.com/PHeqHNG3uk
— Suriya Sivakumar (@Suriya_offl) December 28, 2023
తాజావార్తలు
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!