Site icon NTV Telugu

Vikram: ఆ గెస్ట్ రోల్‌కి సూర్య ఎంత తీసుకున్నాడో తెలుసా..?

Suriya Remuneration For Vikram

Suriya Remuneration For Vikram

స్టార్ హీరోలకు మార్కెట్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వీరి సినిమాలు కళ్లుచెదిరే బిజినెస్ చేస్తాయి. అంతెందుకు.. ఏదైనా ఒక సినిమాలు ఓ చిన్న పాత్రలో మెరిసినా, ఆ హీరోలకుండే స్టార్డమ్ కారణంగా ఆ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చిపడుతుంది. అందుకే, స్టార్ హీరోలకు గెస్ట్ రోల్ చేసినా మంచి డబ్బు అందుతుంది. ఈ నేపథ్యంలో.. విక్రమ్ సినిమాలో తళుక్కుమన్న సూర్య, తాను పోషించిన రోలెక్స్ పాత్రకి ఎంత తీసుకున్నాడనే చర్చ తెరమీదకి వచ్చింది.

నిజానికి.. విక్రమ్ సినిమాలో సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అంటే చాలా తక్కువ. చివర్లో కాసేపు అలా మెరిశాడంతే! కానీ, దాని ఇంపాక్ట్ మాత్రం వర్ణణాతీతం. సినిమా మొత్తం ఒక ఎత్తైతే, సూర్య కనిపించిన గెస్ట్ రోల్ మరో ఎత్తు. గతంలో వచ్చిన ఖైదీకి, త్వరలో రాబోతున్న ఖైదీ 2కి లింక్ అన్నట్లుగా సూర్య రోల్ ఉంటుంది. సినిమా రిలీజైనప్పటి నుంచి ఈ రోల్ గురించే మాట్లాడుతున్నారంటే, దాని ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే, ఈ గెస్ట్ రోల్‌కి గాను సూర్య భారీ మొత్తమే అందుకొని ఉంటాడని అందరూ అనుకుంటున్నారు. కానీ, అతడు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తాజాగా తేలింది.

లోకనాయకుడు కమల్ హాసన్ మీదున్న గౌరవంతోనే, సూర్య ఒక్క పైసా కూడా పుచ్చుకోలేదని తెలిసింది. అవును, ఖైదీ 2తో సూర్య పాత్రకి లింక్ ఉన్న విషయం వాస్తవమే! ఖైదీ2లో నటించేటప్పుడు, ఎలాగో ఆ సినిమాకి పారితోషికం అందుతుంది. అందుకే, విక్రమ్‌లో చేసిన గెస్ట్ రోల్‌కి ఏమీ తీసుకోలేదు. కమల్ హాసన్ మీద ఉన్న అభిమానంతో, విక్రమ్‌లో మెరిశాడని తమిళ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

Exit mobile version