అమెజాన్ కు “జై భీమ్” సెగ… ముదురుతున్న వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటుడు సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం విడుదలైనప్పటి నుండి వివాదంలో ఉంది. ఈ సినిమా ద్వారా వన్నియార్ సంఘం పరువు తీసే ప్రయత్నం చేశారని, సదరు వర్గాన్ని కించపరిచారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ వివాదం రోజురోజుకీ ముదురుతోంది తప్ప ఇంకా చల్లారడం లేదు. తాజాగా #SuriyaHatesVanniyars అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. దీని ద్వారా వన్నియార్ వర్గం ప్రజలు సూర్యపై తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. సూర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం సెగ ఇక్కడితో ఆగలేదు సినిమా ను విడుదల చేసిన దిగ్గజ ఓటిటి సంస్థ అమెజాన్ ను కూడా తాకింది. #amazonstophate అంతో అమెజాన్ పై కూడా మండిపడుతున్నారు. వన్నియార్ వర్గీయుల నుంచి బెదిరింపులు ఎదురవడంతో చెన్నైలోని సూర్య ఇంటి వద్ద ముందు జాగ్రత్తగా భద్రతను పెంచారు. మరోవైపు సూర్యను సపోర్ట్ చేస్తూ ఆయన అభిమానులు, సినిమా సెలెబ్రిటీలు సైతం ట్వీట్స్ చేస్తున్నారు.
Read Also : ‘రాధే శ్యామ్’ స్టోరీ ఇదే… లీక్ చేసిన లిరిసిస్ట్
Also Read
అసలు వివాదం ఏమిటంటే?
సూర్య నటించిన ‘జై భీమ్’ నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. నటుడు తమిజ్ ఈ చిత్రంలో సబ్ ఇన్‌స్పెక్టర్ గురుమూర్తి పాత్రను పోషించారు. సినిమాలోని ఒక సన్నివేశంలో గోడపై క్యాలెండర్ లో మతతత్వ చిహ్నం ఉండగా గురుమూర్తి తాగుతున్నాడు. దీనిపై వన్నియార్ సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఆ చిహ్నాన్ని లక్ష్మీదేవితో చిత్రబృందం రీప్లేస్ చేసినప్పటికీ వివాదం ఏమాత్రం సద్దుమణగలేదు. సూర్యపై పలు చోట్ల కేసులు కూడా నమోదు చేశారు. ఇలాంటి చర్యలు సివిల్, క్రిమినల్ రెండూ క్రిమినల్ కేటగిరీ కిందకు వస్తుందని సంఘం చెబుతోంది. వన్నియార్, వన్నియా కుల క్షత్రియ ఇద్దరూ తమిళనాడులో చాలా వెనుకబడిన వర్గాలు. ఉత్తరాది రాష్ట్రాల్లో వీరి సంఖ్య ఎక్కువ. మరోవైపు “జై భీమ్”పై ప్రశంసల వెల్లువ కురుస్తోంది. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తుందని ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!