‘రాధే శ్యామ్’ స్టోరీ ఇదే… లీక్ చేసిన లిరిసిస్ట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన “రాధే శ్యామ్” చిత్రం 2022 జనవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి వారం క్రితం విడుదలైన “ఈ రాతలే సాంగ్ కు మంచి స్పందనే వచ్చింది. ఈ సాంగ్ కు ప్రముఖ గీత రచయిత కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. పాట కంటే ఎక్కువగా లిరికల్ సాంగ్ వీడియోలో ఉన్న గ్రాఫిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో కృష్ణకాంత్ పాటతో పాటు “రాధే శ్యామ్” కథ గురించి వెల్లడించారు.

కృష్ణకాంత్ మాట్లాడుతూ “రాధే శ్యామ్ 1970ల యూరప్ నేపథ్యంలో సాగే ప్రేమకథ. ఈ సినిమా పునర్జన్మ ఆధారంగా తెరకెక్కుతోందని, టైమ్ ట్రావెల్ సినిమా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా మొత్తం రైలు ప్రయాణంలో జరుగుతుందని కొందరు ఊహిస్తున్నారు. నేను పెద్దగా స్టోరీ బయటపెట్టను. సస్పెన్స్‌ను అలాగే ఉంచుతాను” అని గీత రచయిత అన్నారు.

Read Also : కైకాల ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్

కృష్ణకాంత్ ఇంకా మాట్లాడుతూ ‘రాధే శ్యామ్‌’లో 5 పాటలు రాశాను. “ఈ రాతలే పాట సంక్లిష్టంగా అనిపించవచ్చు. ప్రేక్షకులు ఈ పాటను పెద్ద స్క్రీన్‌పై చూస్తే మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటారు. నిజానికి ఈ రాతలే మాంటేజ్ సాంగ్‌లో చాలా సన్నివేశాల ద్వారా సినిమా మొత్తం కథను చెప్పాము” అంటూ సినిమా స్టోరీ మొత్తం ఈ సాంగ్ లోనే ఉందన్న విషయాన్ని స్పష్టం చేశారు.

సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా ‘రాధే శ్యామ్’కు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రభాస్, పూజ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి సంగీతం జస్టిన్ ప్రభాకరన్ అందించారు.

Related Articles

Latest Articles