Suriya Birthday Gift
తమిళ స్టార్ హీరో సూర్యకు ఆయన నటించిన ‘సురారై పొట్రు’ చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా అవార్డు లభించింది. సూర్యకు బెస్ట్ యాక్టర్ గా ఇదే తొలి నేషనల్ అవార్డ్ కావడం విశేషం! ఈ అవార్డులను జూలై 22న ప్రకటించారు. మరుసటి రోజునే అంటే జూలై 23న సూర్య పుట్టినరోజు. అందువల్ల సూర్యకు నేషనల్ అవార్డు రావడం అన్నది ఆయనకు బర్త్ డే గిఫ్ట్ గా భావించవచ్చు.
శుక్రవారం నేషనల్ అవార్డ్స్ ప్రకటిస్తారని తెలిసిన దగ్గర నుంచీ తమిళనాట సూర్య అభిమానులు తమ అభిమాన హీరోకు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ, ఆ విజువల్స్ ను సోషల్ మీడియాలోనూ భలేగా పోస్ట్ చేశారు. వారి అభిలాషను మన్నిస్తున్నట్టుగానే సూర్యకు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు లభించడం విశేషం!