తమిళ స్టార్ హీరో సూర్యది పెద్ద మనసు. ఆయన తెర మీద మాత్రమే కాదు తెర వెనుక కూడా కథానాయకుడే! నటుడిగా కోట్లాది మంది మనసుల్ని దోచుకునే సూర్య, అర్థవంతమైన చిత్రాలను నిర్మిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. తాజాగా సూర్య ‘జై భీమ్’ అనే చిత్రాన్ని నిర్మించాడు. అంతే కాదు…. అందులో గిరిజనుల పక్షాన నిలిచి పోరాడే చంద్రు అనే లాయర్ పాత్రనూ పోషించాడు. ఈ నెల 2వ తేదీ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా సూర్య, అతని భార్య జ్యోతిక తమిళనాడులోని పెళన్ గుడి ఇరులర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కు కోటి రూపాయల విరాళం అందచేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా ఇరులర్ ట్రస్ట్ కు చెందిన రిటైర్డ్ జస్టిస్ చంద్రుకు, కమిటీ సభ్యులకు ఈ చెక్కును అందచేశారు. కేవలం తెర మీద గిరిజనుల పక్షాన ఉండి పోరాటం జరిపే లాయర్ గానే కాకుండా, రియల్ లైఫ్ లోనూ చదువు ద్వారా గిరిజనుల జీవితంలో వెలుగు నింపే ప్రయత్నం సూర్య చేయడం విశేషం.
Read Also : “భోళా శంకర్” కోసం మిల్కీ బ్యూటీ… భారీ రెమ్యూనరేషన్
