Site icon NTV Telugu

Saipallavi: సూర్య సమర్పణలో సాయిపల్లవి చిత్రం ‘గార్గి’

Saipallavi Next Film Gaargi

Saipallavi Next Film Gaargi

ఫిదా చిత్రంతో తెలుగు వారి గుండెల్లో హైబ్రిడ్ పిల్లగా ముద్ర వేసింది సాయి పల్లవి. ముఖం నిండా మొటిమలు, గ్లామర్ పాత్రలకు నో చెప్పడం, హీరోలతో ఇగో క్లాష్‌లు ఇలా తన వ్యక్తిత్వాన్ని ఎవరి కోసం మార్చుకోకుండా తన క్యారెక్టర్ తో ఇంకో మెట్టు ఎక్కి స్టార్ హీరోయిన్‌గానే కాకుండా విలువలు గల హీరోయిన్ గా అందరిచేత శభాష్ అనిపించుకుంటోంది. ‘విరాటపర్వం’తో వెన్నెలగా అభిమానుల్ని మెప్పించిన సాయిపల్లవి.. ఇప్పుడు ‘గార్గి’తో అలరించేందుకు సిద్ధమవుతోంది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గార్గి’. ఈ సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ప్రముఖ నటులు సూర్య – జ్యోతిక సమర్పించనున్నారు. ఈ విషయాన్ని సూర్య శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర బృందంతో దిగిన ఫొటోలను నెట్టింట పంచుకున్నారు.

న్యాయ వ్యవస్థ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఆడపిల్లలను చులకనగా చూసే సమాజంలో ఒక ఆడపిల్ల.. తన హక్కుల కోసం పోరాటం చేసే కథగా ఈ సినిమా తెరక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక గోవింద్ వసంత సంగీతం సినిమాకు హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Exit mobile version