NTV Telugu Site icon

Suriya 43: ఏం కాంబో రా మావా.. రికార్డులు గల్లంతు అవ్వడం ఖాయం

Suriya

Suriya

Suriya 43: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. వైవిధ్యమైన కథలను ఎంచుకొని హిట్లు అందుకుంటున్నాడు సూర్య. ఇక అతని కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి ఆకాశం నీ హద్దురా. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఇక ఈ కాంబో మరోసారి రిపీట్ కానుంది. సూర్య హీరోగా.. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం సూర్య43. 2 ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై జ్యోతిక, రాజశేఖర్ పాండియన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాధారణంగా హైప్ రావాలంటే.. ఈ కాంబో ఒకటి సరిపోతుంది. కానీ, సుధా.. ఈసారి క్యాస్టింగ్ తోనే హైప్ ఆకాశానికి తాకేలా చేసింది. ఈ చిత్రంలో సూర్య సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తుండగా.. మరో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Jayaprada: ఇంటిమేట్ సీన్.. నటుడ్ని చెంప దెబ్బ కొట్టిన జయప్రద.. అతడేమన్నాడంటే..?

ఇక బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఆయనకు ఈ సినిమా 100 వ సినిమా కావడం విశేషం. ఇక ఈ స్టార్ క్యాస్టింగ్ చూసాక సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ విషయాన్నీ సూర్య అధికారికంగా ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇలాంటి సినిమా చేయడం అద్భుతమని చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులు గల్లంతు చేస్తుందో చూడాలి.