Surekha Vani: టాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖా వాణి. ఇక ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూతురు సుప్రీతతో కలిసి చిట్టిపొట్టి డ్రెస్ లలో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఇంటర్వ్యూలలో తనకు కాబోయే వాడు ఆలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ చెప్పి కొద్దిరోజుల క్రితం ఆమె హాట్ టాపిక్ గా మారింది. ఇక సురేఖా వాణి సినిమాలకు దూరంగా ఉన్నారని, ఆమె సినిమాలు చేయడం మానేసిందని గత కొన్నిరోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తలపై సురేఖా తాజాగా స్పందించింది. ఇటీవల విడుదలైన స్వాతి ముత్యం సినిమాలో హీరో తల్లిగా నటించి మెప్పించిన సురేఖా వాణి ఈ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ “గత కొన్ని రోజులుగా నేను సినిమాలు మానేశాను అని వార్తలు వస్తున్నాయి. కానీ, అది నిజం కాదు. ఎందుకో తెలియదు కానీ, నాకు అవకాశాలు రావడం లేదు. మాదాకా వస్తే నటించడానికి నేను ఎప్పుడు రెడీ గానే ఉంటాను. నేను సినిమా అమ్మాయిని.. సినిమానే నా జీవితం. అవకాశం వస్తే సినిమాలు తప్పకుండా చేస్తాను. ఇక స్వాతిముత్యం సినిమా గురించి లక్ష్మణ్ కథ చెప్పినప్పుడు కూడా నేను ఇదే అడిగాను.. నాకన్నా ముందు ఈ పాత్రను ఎవరికైనా చెప్పారా..? లేక మొదటిసారి నాకే చెప్తున్నారా..? అని.
ఇక ఈ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ కు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి సినిమాలు ఆయన మరిన్ని చేయాలనీ కోరుకుంటున్నాను”అని చెప్పుకొచ్చింది. ఇక ఈ క్లారిటీ తో సురేఖా వాణి రూమర్స్ కు చెక్ పెట్టిందనే చెప్పాలి. ఇక ఈమె వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో కూతురితో ఓవర్ యాక్షన్ చేయడం ఆపితే అవకాశాలు వస్తాయి అని కొందరు.. చిట్టిపొట్టి డ్రెస్ లు వేసుకొని బికినీలో తిరిగితే తల్లి, అత్త పాత్రలు ఎలా వస్తాయని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.