Site icon NTV Telugu

Surekha Vani: డ్రగ్స్ కేసు.. దయచేసి నన్ను.. నా కుటుంబాన్ని నాశనం చేయకండి

Surekha

Surekha

Surekha Vani: టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కొత్త కొత్త పరిణామాలకు దారితీస్తుంది. నిర్మాత కేపీ చౌదరితో క్లోజ్ గా ఉన్నవారందరిని పోలీసులు విచారించడం మొదలుపెట్టారు. అతడిని విచారించిన అనంతరం అతడి కస్టమర్ల లిస్ట్ లో తెలుగు ఆర్టిస్టులు ఉన్నారంటూ పుకార్లు గుప్పుమన్నాయి. అషూరెడ్డి, సురేఖా వాణి, జ్యోతి తదితరులు.. కేపీ చౌదరి డ్రగ్స్ కస్టమర్ల లిస్ట్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అతనితో కలిసి దిగిన వీరి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాయి. ఇక ఈ డ్రగ్స్ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని వీరందరూ.. ఒకరి తరువాత ఒకరు క్లారిటీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే అషూ.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి చెప్పగా.. జ్యోతి లైవ్ పెట్టి చెప్పింది. ఇక తాజాగా సురేఖావాణి సైతం ఒక వీడియో ద్వారా ఈ విషయాన్ని ఖండించింది. ఈ డ్రగ్స్ కేసు వలన తమ కుటుంబం పరువు పోతుందని ఆమె తెలిపింది.

Prabhas: సర్.. నేను ప్రభాస్.. కమల్ ను డార్లింగ్ కలిసిన వేళ..

“గతకొంతకాలంగా మాపై వస్తున్న ఆరోపణలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. దయ ఉంచి మాపై ఆరోపణలు చేయడం ఆపేయండి. మీరు చేస్తున్న వాటి వల్ల నా కెరీర్, ఫ్యూచర్, మా పిల్లల కెరీర్ నా కుటుంబం ఆరోగ్యం.. ఇలా అన్నిరకాలుగా చాలా ఎఫెక్ట్ అవుతున్నాం. ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి..నా కుటుంబాన్ని నాశనం చేయకండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version