NTV Telugu Site icon

Surekha Vani: డ్రగ్స్ కేసు.. కేపీ చౌదరితో సురేఖవాణి.. మరీ దారుణంగా ముద్దులు పెడుతూ

Surekha

Surekha

Surekha Vani:టాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతుంది. కబాలి నిర్మాత కేపీ చౌదరి.. డ్రగ్స్ గోవా నుంచి హైదరాబాద్ కు తీసుకువస్తూ దొరికిపోయాడు. ఇది టాలీవుడ్ ను కుదిపేసింది. సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులు గజగజ వణికిపోతున్నారు. ఇక రెండు రోజులు పోలీస్ విచారణలో కేపీ చౌదరి కస్టమర్ల లిస్ట్ ను పోలీసులు సంపాదించారు. అందులో టాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా ఉండడం మరోసారి ఇండస్ట్రీని ఆందోళనకు గురిచేస్తుంది. ఆ లిస్ట్ లో అషూరెడ్డి, జ్యోతి, సురేఖావాణి ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందులో నిజం కూడా లేకపోలేదని నెటిజన్లు అంటున్నారు. అలా అనడానికి కారణం.. గతంలో కేపీ చౌదరితో వీరు దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రతి పార్టీలో వీరితో కలిసి కేపీ చౌదరి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Ashu Reddy: అయ్యో అషూకు ఏమైంది.. చేతికి సెలైన్.. అమెరికాలో చికిత్స..

ముఖ్యంగా సురేఖావాణి ఫోటో అయితే మరింత వైరల్ గా మారింది. ఒక పార్టీలో మద్యం మత్తులో కారు పార్కింగ్ ఏరియాలో కేపీ చౌదరిని ముద్దాడుతూ కనిపించింది. దీంతో నెటిజన్లు ఆమెను ఏకిపారేస్తున్నారు. ఖచ్చితంగా ఆమె డ్రగ్స్ తీసుకోవడం వలనే ఇలా చేసిందని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ ఫొటోల్లో అషూరెడ్డి, జ్యోతి, సురేఖావాణి కామన్ గా ఉండగా.. మరికొందరు స్నేహితులు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు ఏ రంగానికి చెందినవారో తెలియాల్సి ఉంది. ఈ కేసులో అషూరెడ్డి, జ్యోతి, సురేఖావాణి ఇరుక్కున్నారా..? లేక నిజంగానే ఉన్నారా..? అనేది తెలియాల్సి ఉంది.