NTV Telugu Site icon

Supriya Yarlagadda: నేను నాలుగు సార్లు పారిపోతే.. పవన్ తీసుకొచ్చి

Pawan

Pawan

Supriya Yarlagadda: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా గుర్తుందా.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కళ్యాణ్ బాబు గ్రాండ్ ఎంట్రీ..అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులే కాదు ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా చూశారు. ఇక చిరు తమ్ముడి మొదటి సినిమా అంటే హీరోయిన్ కూడా అంతే బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయి కావాలి.. అని అనుకోని అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ యార్లగడ్డను పరిచయం చేశారు. ఇద్దరు.. సినిమాకు కొత్త. అంతకుముందు నేర్చుకున్నది కూడా ఏమి లేదు. అయినా వారితో కలిసి పనిచేయించాడు డైరెక్టర్ ఇ.వి.వి. సత్యనారాయణ. ఇక ఆ సినిమా చేసేటప్పుడు సుప్రియ ఎన్ని ఇబ్బందులు పడిందో ఆమె తాజాగా పాల్గున్న ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Kajol: అప్పుడు నల్లగా, బండగా ఉంది .. ఇప్పుడు తెల్లగా ఉండడానికి సర్జరీ..?

సింగర్ స్మిత.. హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో నిజం విత్ స్మిత. ఈ షో మొదలైనప్పటినుంచి ఎంతోమంది స్టార్లు తమ వ్యక్తిగత విషయాలను సైతం నిర్భయంగా చెప్పుకొచ్చారు. తాజాగా ఈ షోల్లో ముగ్గురు స్టార్ మహిళామణులు పాల్గొన్నారు. వారే.. రాధికా శరత్ కుమార్, స్వప్న దత్, సుప్రియ యార్లగడ్డ. ఇక సుప్రియ.. తన ప్రయాణం గురించి చెప్తూ.. ” ఒక రెండో షెడ్యూల్ జరుగుతున్న సమయంలో నాలుగు సార్లు సెట్ నుంచి పారిపోయాను. అప్పుడు కళ్యాణ్ వచ్చి.. నువ్వు ఈ సినిమా ఫినిష్ చేయాలి. ఇక ఇలా పారిపోవడం అని ఉండదు” అని చెప్పినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.