Thalaivar 173: రజనీకాంత్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘తలైవర్ 173’ టైటిల్ రివీల్ రేపే!

Thalaivar 173

Thalaivar 173

Thalaivar 173: భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘తలైవర్ 173’ (Thalaivar 173). తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్.. ఒక అదిరిపోయే వార్తను రివీల్ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, ఉలగనాయగన్ కమల్ హాసన్ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా టైటిల్‌ను రేపు (బుధవారం) ఉదయం 10:00 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

“One Name, Forever a Celebration” అనే ఒక పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో చిత్ర బృందం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అటు రజనీ ఫ్యాన్స్, ఇటు కమల్ హాసన్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రేపు ఉదయం రాబోయే టైటిల్ అనౌన్స్‌మెంట్ కోసం ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

×
×
Ad