కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్స్ తడబడుతున్న వేళ, భారీ బూస్టర్ ఇచ్చాడు సూర్య. ‘కరుపు’తో అప్కమింగ్ బిగ్ బడ్జెట్ సినిమాలకు ఊపిరిపోసాడు. ‘జననాయగన్’ థియేటర్స్‌లో వస్తుందో రాదో అన్న డైలమా ఇంకా కంటిన్యూ అవుతోంది. 2024లో ‘వేట్టయాన్’, ‘ఇండియన్ 2’, ‘కంగువ’ లాంటి డిజాస్టర్స్‌తో భారీగా దెబ్బతింది కోలీవుడ్. 2025లో రజినీకాంత్, కమలహాసన్, సూర్య ఆ పుండును మాన్పుతారేమో అనుకుంటే పెద్దది చేశారు. 2026లో సూర్య తన ఫ్లాప్ లెక్కలు ‘కరుపు’తో తీర్చేశాడు. ఇక 300 కోట్లు కొల్లగొట్టి, కోలీవుడ్ అప్కమింగ్ భారీ బడ్జెట్ చిత్రాలకు ఊపిరి పోసాడు.
బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ గల్లంతు చేసే విజయ్ దళపతి ‘జననాయగన్’ థియేటర్స్‌లోకి వస్తుందో రాదో.. ఇంకా డైలమాలోనే కొనసాగుతోంది. కమల్ ఈ ఏడాది రావటం కష్టమే. ఇక బాకీ తీర్చాల్సింది రజినీనే. రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వస్తున్న హై యాక్షన్ ఫిలిం ‘జైలర్ 2’. ‘జైలర్’ మాసివ్ హిట్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ ఇప్పటివరకు పార్ట్ 2 జోలికి పోని తలైవర్ నుండి వస్తున్న ఫస్ట్ సీక్వెల్ ఇది.
‘జైలర్’ కన్నా మరింత హై పిచ్‌తో స్టార్స్‌ను ఈ ప్రాజెక్ట్‌లో ఇన్బిల్ట్ చేశాడట నెల్సన్ దిలీప్ కుమార్. బాలకృష్ణ నుండి షారుక్, హృతిక్ అంటూ పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరన్నది ఇంకా సస్పెన్సే. ‘జైలర్ 2’ షూటింగ్‌కు ఇప్పటికే గుమ్మడికాయ కొట్టేసింది టీం. తొలుత ఆగస్టు 14న రిలీజ్ చేద్దాం అనుకుంటే.. సెప్టెంబర్ 4, 11 డేట్స్ పరిశీలించారని తెలుస్తోంది. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం, సెప్టెంబర్‌లో కూడా రాకపోవచ్చట. దీపావళి ఫెస్టివల్ టార్గెట్ చేస్తూ నవంబర్ 8న మూవీ తీసుకురావాలన్నది మేకర్స్ ప్లాన్ అని కోలీవుడ్ బజ్. అయితే, ఇప్పటివరకు ఏ డేట్‌ను మేకర్స్ అఫీషియల్ చేయలేదు. తలైవర్ ఎప్పుడు వచ్చినా గత ఫ్లాప్ లెక్కలు సరిచేసి, కోలీవుడ్‌లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి.

