Krishna: సూపర్ స్టార్ కృష్ణ తీరని కోరికలు.. ఇన్ని ఉన్నాయా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna: సూపర్ స్టార్ కృష్ణ నేటి ఉదయం మృతి చెందిన విషయం విదితమే. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఒక లెజెండ్ ను టాలీవుడ్ కోల్పోయింది. ఘట్టమనేని కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. నటశేఖర నుంచి సూపర్ స్టార్ గా కృష్ణ ఎదిగిన వైనం ఎంతోమందికి ఆదర్శప్రాయం. వివాదాలు లేని నటుడు, ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్స్ కృష్ణ. ఇక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూసిన కృష్ణ జీవితంలో కూడా తీరని కోరికలు ఉన్నాయట.. ఒకటి కాదు నాలుగు కోరికలను మనుసులో ఉంచుకొని మృతిచెందారు కృష్ణ.. అవేంటంటే.. కొడుకులతో కలిసి నటించాలని ప్రతి తండ్రికి ఉండే కోరికే. అయితే ఆ కోరిక.. కృష్ణ చిన్నప్పుడే నెరవేరింది. రమేష్ బాబు, మహేష్ బాబులతో కలిసి కృష్ణ ఎన్నో సినిమాల్లో నటించారు. కాగా మహేష్ కొడుకు గౌతమ్ తో నటించాలని కృష్ణ ఆశపడ్డారట.
వన్ నేనొక్కడినే తరవాత మహేష్ సినిమాలో గౌతమ్ తో పాటు ఆయన కూడా కలిసి నటించాలని కోరుకున్నారట. అంటే మనం లో ఎలా అయితే అన్ని తారలు ఉన్నాయో.. అలాగే కృష్ణ కూడా మనవడు, కొడుకుతో నటించాలనుకున్నాడట. కానీ, ఆ కోరిక తీరలేదు. ఇక కృష్ణకు చిన్నతనం నుంచో హోస్ట్ గా చేయడం ఇష్టమట.. హిందీలో అమితాబ్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి లాంటి టాక్ షోను తెలుగులో తీసుకొచ్చి హోస్ట్ చేయాలని అనుకున్నారట. ఆ కోరిక కూడా నెరవేరలేదు. ఇక ఎన్నో పౌరాణిక పాత్రల్లో కనిపించిన కృష్ణకు ఛత్రపతి శివాజీ పాత్రలో కనిపించాలని ఉండేదట.. కానీ కథ మంచిది దొరక్కపోవడంతో వెనకడుగు వేశారట. ఇక ఈ కోరిక అందరికి తెల్సిందే.. సూపర్ స్టార్ మహేష్ బాబును జేమ్స్ బాండ్ గా చూడాలనుకున్నారు. కానీ, మహేష్ టక్కరి దొంగ ప్లాప్ కావడంతో మరోసారి అలాంటి పాత్రలు చేయడానికి మహేష్ నిరాకరించడంతో ఆ ఆశ కూడా నిరాశగా మిగిలిపోయింది. ఏదిఏమైనా ఈ కోరికలు అంత పెద్దవి ఏమికావు . కొంచెం రిస్క్ చేసినా కృష్ణ అన్ని కోరికలు నెరవేర్చుకొనేవారు అని అంటున్నారు అభిమానులు .
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!