Site icon NTV Telugu

Mahesh Babu: గొప్ప కలని నిజం చేసి చూపించారు…

Mahesh Babu Rrr

Mahesh Babu Rrr

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ అవార్డ్ గెలుచుకోని కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ జరిగిన 79 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో జరగనిది, ఈ 80వ ఈవెంట్ లో జరిగింది ఏంటంటే ఒక ఏషియన్ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ అందుకోవడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకూ ఒక్క ఏషియన్ సినిమాల్లోని ఏ పాట కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని గెలుచుకోలేదు అనే మాటని చెరిపేస్తూ ఆ స్థానంలోకి ఇప్పుడు నాటు నాటు సాంగ్ వచ్చి చేరింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ తెస్తుంది అనే ఆశలని మరింత పెంచింది ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్. మార్చ్ 12న నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో కూడా అవార్డ్ ను సాదిస్తే ఇండియన్ సినిమా గ్లోరీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించినట్లే.

ఇదిలా ఉంటే నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సొంతం చేసుకోవడంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించాడు. “Watching the world cheer for an Indian film is a dream come true!! This year couldn’t have started on a better note! Congratulations mm keeravaani garu, ssrajamouli sir, tarak, Ram Charan & the entire team of #RRR… Many more to come!!” అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. మహేశ్-రాజమౌళిల కాంబినేషన్ లో SSMB 29 అనౌన్స్ అయ్యింది. ఈ పాన్ వరల్డ్ అడ్వెంచర్ సినిమాతో ఇండియన్ సినిమాకి మరింత ఇంటర్నేషనల్ రీచ్ వచ్చే ఛాన్స్ ఉంది. 2024 డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్న ఈ SSMB 29పై ఇప్పటినుంచే భారి అంచనాలు ఉన్నాయి.  

Exit mobile version