NTV Telugu Site icon

Mahesh Babu: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సూపర్ స్టార్…

Mahesh Babu

Mahesh Babu

ఘట్టమనేని ఫాన్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. మహేశ్ బాబుకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా ట్విట్టర్ ని షేక్ చేసే రేంజులో ట్వీట్స్ చేస్తారు. చిన్న రీజన్ కి కూడా ట్విట్టర్ లో ట్రెండ్ చేసే ఫాన్స్, ప్రస్తుతం మహేశ్ బాబు ట్యాగ్ ని టాప్ ట్రెండ్ చేస్తున్నారు. ఇందుకు కారణం మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా రిలీజ్ అయ్యి నాలుగేళ్లు అవ్వడమే. మహేశ్ 25వ సినిమాగా రిలీజ్ అయిన మహర్షి మూవీని వంశీ పైడిపల్లి సూపర్బ్ గా డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలోని కాలేజ్ ఎపిసోడ్ లో మహేశ్ బాబు లుక్ మాస్ గా కేరాఫ్ అడ్రెస్ లా ఉంటుంది. ఈ లుక్ కోసమే సినిమాకి వెళ్లిన ఫాన్స్ ఎంతోమంది ఉన్నారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యాన్ స్టఫ్ తో సెకండ్ హాఫ్ అంతా సాలిడ్ కంటెంట్ తో రూపొందిన మహర్షి మూవీ ఓవరాల్ గా సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది.

Read Also: NTR 30: గత ఏడేళ్లలో మూడు సార్లు ఒకటే రోజున… హిస్టరీ రిపీట్స్

పోకిరి, శ్రీమంతుడు సినిమాలు కలిస్తే ఎలా ఉంటుందో మహర్షి మూవీ అలా ఉంటుంది. అందుకే తన 25వ సినిమా కోసం మహేశ్ బాబు అన్ని ఎలిమెంట్స్ ఉన్న కథని నమ్మి సినిమా చేశాడు. ఈ మూవీతో అల్లరి నరేష్ కొత్త కెరీర్ ని స్టార్ట్ చేశాడు, ఒక నటుడిగా అతను మళ్లీ ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. రైతుల గురించి, అర్బన్ ఫార్మింగ్ గురించి, సక్సస్ గురించి పర్ఫెక్ట్ గా చెప్పిన మహర్షి సినిమా డబ్బులు మాత్రమే కాదు రెండు నేషనల్ అవార్డ్స్ ని కూడా గెలుచుకుంది. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అండ్ బెస్ట్ ఖొరియోగ్రాఫర్ కేటగిరిల్లో మహర్షి మూవీ నేషనల్ అవార్డ్ అందుకుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యి నాలుగేళ్లు అయిన సందర్భంగా ఫాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.

Show comments