మంచు వారబ్బాయి మంచు విష్ణు ప్రస్తుతం మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెల్సిందే. ఇక ఒక పక్క ప్రెసిడెంట్ గా కొనసాగుతూనే విష్ణు హీరోగా కొత్త సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుండగా.. కోన వెంకట్ కథను అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విష్ణు సరసన హాట్ బ్యూటీలు పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో విష్ణు గాలి నాగేశ్వరావు గా కనిపిస్తున్నట్లు తెలిపారు.
ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం సన్నీ హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఇక షూట్ అయిపోయాక సన్నీని మోహన్ బాబు తిరుపతిలోని తమ విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ సన్నీతో విద్యార్థులకు హయ్ చెప్పించారు. ఇక సన్నీ లియోన్ని చూడడంతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. సన్నీ వారి వద్దకు వెళ్ళడానికి తడబడుతుండడంతో మోహన్ బాబు చేయి పట్టుకొని మరీ అందరికి హాయ్ చెప్పించారు. ఇక ఈ వీడియోను సన్నీ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ.. మోహన్ బాబుకు ధన్యవాదాలు తెలిపింది. మరి ఈ మంచు విష్ణు హిట్ ని అందుకుంటాడా..? లేదా అని చూడాలి.
