Ginna: రేణుకగా అలరించబోతున్న పోర్న్ స్టార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ తెలుగులో పూర్తి స్థాయిలో నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఈ చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ చిత్రంలో సన్నీ లియోన్ పాత్ర ఏమిటి, ఆమె ఎలా నటిస్తుందో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సందర్భంలో కొత్త లుక్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది. ఇందులో సన్నీ లియోన్ ‘రేణుక’ అనే పాత్రను పోషిస్తోంది. జిన్నా చిన్నప్పటి స్నేహితురాలైన తాను అతని జీవితంలో అప్ అండ్ డౌన్స్ కు ఎలా కారణమైందో తెర మీద చూడాలని సన్నీ చెబుతోంది. ఊహకందని మలుపులతో కథ సాగుతుందని తెలిపింది. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ‘జిన్నా’ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను రచయిత కోన వెంకట్ అందించారు. హీరో మంచు విష్ణు సరసన సన్నీలియోన్ తో పాటు మరో డైనమిక్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.
Also Read
- Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
- Chennai LoveStory : 'చెన్నై లవ్‌స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
- Release Dates Announce : ఎట్టకేలకు ల్యాబ్ నుండి బయటకు వస్తున్న కోలీవుడ్ మూవీస్
- Jananayagan : జననాయకుడు కోసం ఆంధ్ర, నైజాంలో విచ్చలవిడిగా థియేటర్స్, షోస్ పరిచేసారు
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘జిన్నా’ రోజురోజుకు మంచి బజ్‌ని సొంతం చేసుకుంటోంది. ఈ మూవీలోని పాటకు ‘నాటు నాటు’ ఫేమ్ ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. అనూప్ రూబెన్స్ స్వరాలు అందించిన ఈ మూవీకి చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను సన్నీలియోన్ సైతం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
So excited to introduce to you – #Renuka!
I am #Ginna ‘s childhood buddy but that doesn’t mean I won’t turn his life upside down 🤭!! It’s going to be a crazy journey full of unexpected twists and turns 😎#SunnyLeone #GinnaRenuka @iVishnuManchu pic.twitter.com/R8uWcemweW— Sunny Leone (@SunnyLeone) August 10, 2022
తాజావార్తలు
-
Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
-
Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
-
Chennai LoveStory : ‘చెన్నై లవ్‌స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
-
Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
-
AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!