NTV Telugu Site icon

Gopichandh Malineni : సన్నీ డియోల్ ‘JAAT’ రిలీజ్ డేట్ వచ్చేసింది

Jaat

Jaat

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ సెకండ్ ఇన్నింగ్స్ గోల్డెన్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. ఒకప్పటి తన సూపర్ హిట్ సినిమా గద్దర్ కు సీక్వెల్ గా గద్దర్ – 2 తో రీ ఎంట్రీ లో సన్ని డియోల్ అదరగొట్టాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గద్దర్ -2 సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించింది. ఆ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేసేందుకు టాలీవుడ్ దర్శకుడు గోపించంద్ మలినేని దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ బాలీవుడ్ హీరో.

Also Read : Rebal Star : ‘కన్నప్ప’లో ప్రభాస్.. ఇది అస్సలు ఊహించలేదుగా

వీరసింహ రెడ్డి హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాతో గోపిచంద్ మలినేని బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. ‘JAAT’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూట్ ను చక చక ఫినిష్ చేస్తున్నాడు గోపీచంద్ మలినేని. సన్నీ డియోల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్ కు అద్భుత రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ  ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది జాట్. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను హిందీ తో పాటు తెలుగు మరియు తమిళ్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీస్ బ్యానర్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్  పై నవీన్ యెర్నేని, రవి ఎలమంచిలి, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.