Rebal Star : ‘కన్నప్ప’లో ప్రభాస్.. ఇది అస్సలు ఊహించలేదుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రీతి ముకుందన్ ఫీమెల్ లీడ్‌లో నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో మోహన్ బాబుతో పాటు మలయాళ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శివుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తుండగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నంది పాత్రలో కనిపించనున్నాడు.
Also Read : MB Foundation : నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా MB ఫౌండేషన్ స్పెషల్ డ్రైవ్
Also Read
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ఇప్పటికే దాదాపుగా అందరి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయగా ఆడియెన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ప్రభాస్ లుక్ ఇంకా రివీల్ చేయలేదు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కేవలం గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నాడనే టాక్ ఉంది. కానీ లేటెస్ట్ న్యూస్ మాత్రం అస్సలు ఊహించకుండా ఉందనే చెప్పాలి. కన్నప్పలో ప్రభాస్ పై ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సాంగ్‌ని డాన్స్ మాస్టర్ గణేష్ మాస్టర్ కంపోజ్ చేసినట్టుగా చెబుతున్నారు. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ స్క్రీన్ స్పేస్ కాస్త ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ప్రభాస్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఎక్కువ భాగం న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ఈ వేసవి కానుకగా ఏప్రిల్ 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన విష్ణు త్వరలోనే ప్రభాస్‌కు సంబంధించిన స్పెషల్ టీజర్ రిలీజ్ చేయనున్నట్టుగా సమాచారం.
తాజావార్తలు
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!