Prithiviraj: ఆ స్టార్ హీరో స్థానంలో అక్షయ్ కుమార్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్లో ఉన్న మోస్ట్ బ్యాంకబుల్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. ఇతని సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చినా సరే, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. పైగా, అతి తక్కువ సమయంలోనే షూటింగ్ కంప్లీట్ చేస్తాడు. ఏకకాలంలోనే రెండు, మూడు సినిమాల చిత్రీకరణల్లో పాల్గొంటాడు. ఇతనికున్న ఈ కమిట్మెంట్ & బాక్సాఫీస్ ట్రాక్ రికార్డ్ చూసే.. దర్శకనిర్మాతలు అక్షయ్‌తో సినిమాలు చేసేందుకు క్యూ కడుతుంటారు. చివరికి.. ఇతర హీరోలకు వెళ్ళాల్సిన ప్రాజెక్టులు కూడా ఇతనికి చేరుతాయి. అలాంటి వాటిల్లో పృథ్వీరాజ్ ఒకటి.
తొలుత ఈ సినిమాను సన్నీ డియోల్‌తో చేయాలని మేకర్స్ భావించారు. పృథ్వీరాజ్ లాంటి వారియర్ కింగ్ పాత్రకు, సన్నీ అయితేనే పర్ఫెక్ట్గా సూటవుతాడని, అతనితోనే ఈ చిత్రం చేయాలని దాదాపు ఫిక్సయ్యారు. దర్శకుడు చంద్రప్రకాశ్ ద్వివేది ఆ హీరోతో చర్చలు జరిపాడు కూడా! అయితే, ఇంతలో నిర్మాత ఆదిత్య చోప్రా జోక్యం చేసుకొని, బ్యాంకబుల్ స్టార్ అయిన అక్షయ్ కుమార్‌ని తీసుకోవాలని సూచించాడట! సన్నీ డియోల్ ఫేడవుట్ అయిన సంగతి తెలిసిందే! కంబ్యాక్ ఇవ్వాలని ఆ హీరో చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో, ఆయనతో సినిమాలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఆదిత్య చోప్రా కూడా మార్కెట్ పరంగా ఆలోచించి.. సన్నీ డియోల్ స్థానంలో అక్షయ్‌ని దింపాలని చెప్పాడు. దీంతో, అక్షయ్‌తోనే ఈ సినిమా చేయడం జరిగింది.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
అయితే.. ట్రైలర్ విడుదలైన తర్వాత అక్షయ్ ఏమాత్రం పృథ్వీరాజ్ పాత్రలో సూటవ్వలేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇది చూడ్డానికి కింగ్‌కి తక్కువ, కమెడియన్‌కి ఎక్కువ కనిపిస్తున్నాడని సెటైర్లు వేస్తున్నారు. ‘హౌస్‌ఫుల్ 4’ అక్షయ్ పోషించిన ‘బాలా’లాగే ఇందులో కామెడీగా కనిపిస్తున్నాడంటూ.. అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. ట్రైలర్‌కే పరిస్థితి ఇలా ఉందంటే, సినిమా కాస్త తేడా కొడితే ఏమౌతుందో ఏమో?
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!