Sunisith: శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తాను చేయాల్సిన హీరో పాత్రలను.. స్టార్ హీరోలు అడిగితే ఇచ్చేసానని బిల్డప్ ఇస్తూ తిరుగుతూ.. స్టార్ హీరోలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ పై సునిశిత్ చేసే వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉంటాయి. ఇక కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ సైతం తమ రేటింగ్ పెంచుకోవడానికి ఇతగాడిని ఇంటర్వ్యూలకు పిలిచి.. హీరోల గురించి మాట్లాడమని చెప్తూ ఉంటారు. దొరికిందే సందు అన్నట్లు.. ఈ శాక్రిఫైజ్ స్టార్.. నోటికి ఏది వస్తే అది హీరోల గురించి మాట్లాడి తన్నులు తింటూ ఉంటాడు. మొన్నటికి మొన్న రామ్ చరణ్,ఉపాసన ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి రామ్ చరణ్ ఫ్యాన్స్ చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. అయినా ఇతడిలో మార్పు రాలేదు. ఆ తరువాత సునిశిత్, జూనియర్ ఎన్టీఆర్ మీద ఘాటు ఆరోపణలు చేశాడు. ” జూనియర్ ఎన్టీఆర్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఎంత పెద్ద హీరో అయినా అతను పోర్న్ సినిమాలు చేశాడు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. కేవలం నాకు మాత్రమే తెలుసు” అంటూ వాగాడు.
Sharat Saxena: ఛీ.. ఇదేనా బతుకు.. అసహ్యం వేసేది.. ఆ హీరోలు అలా
ఇక అంతే ఎన్టీఆర్ ను పోర్న్ సినిమాలు చేశాడు అంటావా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. సునిశిత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం ఒక్కటేనా.. కనిపిస్తే చంపేస్తాం అన్నంతగా కర్రలు పట్టుకు తిరిగారు. దీంతో చాలా రోజుల నుంచి సునిశిత్ ప్రాణభయంతో పరుగులు పెడుతూనే ఉన్నాడు.ఇక తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కూల్ చేస్తూ సునిశిత్ ఎన్టీఆర్ కు, ఆయన అభిమానులకు క్షమాపణలు చెప్పుకొచ్చాడు. “ఎన్టీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పే. నన్ను క్షమించండి.. ఎన్టీఆర్ గారు.. నన్ను క్షమించండి.. ఫ్యాన్స్ నా తప్పును మన్నించి.. ఇకనుంచి నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దని కోరుకుంటున్నాను. నేను ఈరోజు నుంచి ఎన్టీఆర్ కు సపోర్టర్ ను.. థాంక్స్” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్యాంట్ తడిచేలా భయపెట్టినట్టున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.. సారీ చెప్పక చస్తాడా అంటూ చెప్పుకొస్తున్నారు.