Sunisith: శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తాను చేయాల్సిన హీరో పాత్రలను.. స్టార్ హీరోలు అడిగితే ఇచ్చేసానని బిల్డప్ ఇస్తూ తిరుగుతూ.. స్టార్ హీరోలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ పై సునిశిత్ చేసే వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉంటాయి.