Site icon NTV Telugu

Sunil : భయంకరమైన విలన్.. బాలీవుడ్ ఎంట్రీ..!

Sunil1 Copy

Sunil1 Copy

 

కెరీర్ మొదటి కమెడియన్‌గా సినిమాలు చేసిన సునీల్.. ఆ తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోగా కొన్నేళ్లు బిజీగా సినిమాలు చేశాడు. కాని హీరోగా కొన్ని సినిమాలు కలిసి రాక పోవడంతో.. మళ్లీ కమెడియన్‌గా చేస్తున్నాడు. ఇక పుష్ప సినిమాతో పూర్తిగా విలన్‌గా మారిపోయాడు సునీల్. అంతకు ముందు రవితేజ డిస్కోరాజాలో నెగెటివ్ రోల్ చేసినప్పటికీ.. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో విలన్‌గా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ పుష్ప సినిమాలో మంగళం శీనుగా అదరగొట్టాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో పుష్ప హవా కొనసాగింది. దాంతో అక్కడ సునీల్.. విలన్‌గా ఫేమస్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో.. సునీల్‌కు హిందీలో కూడా ఆఫర్లు వస్తున్నాయి.

గతంలో సునీల్‌కు హిందీ ఆఫర్లు వచ్చినా.. తన పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడంతో పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ పుష్ప తర్వాత బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నట్టు గతంలో చెప్పుకొచ్చాడు సునీల్. అయితే రీసెంట్‌గా రిలీజ్ అయిన ఎఫ్ 3లో కీలక పాత్రలో నటించాడు సునీల్. ఈ సందర్భంగా మరోసారి హిందీలో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు. వీటిలో ఒక సినిమాలో విలన్ గా నటించబోతున్నాడట.. మరో సినిమాలో హీరో పక్కన ఉండే మెయిన్ కమెడియన్‌గా కనిపించబోతున్నాడట. ఒక్క హిందీ మాత్రమే కాదు.. తమిళ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్టు తెలిపాడు. ఈ విషయంలో.. సుకుమార్, బన్నీకి తను జీవితాంతం రుణపడి ఉంటానని అన్నాడు. ఇక ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో.. పుష్ప2లో తన పాత్ర భయంకరంగా ఉంటుందని చెప్పాడు. అలాగే చరణ్, శంకర్ ప్రాజెక్ట్‌లో తన పాత్ర హైలెట్‌గా ఉంటుందని.. తాను ఇప్పటి వరకు అలాంటి రోల్ చేయలేదని చెప్పుకొచ్చాడు. అయితే కమెడియన్‌గానే కాదు.. త్వరలోనే హీరోగా కూడా సినిమాలు చేయబోతున్నాడట. ఏదేమైనా సునీల్‌ ఇప్పుడు సాలిడ్‌గా కమ్ బ్యాక్ అయ్యాడని చెప్పొచ్చు.

Exit mobile version