Site icon NTV Telugu

Sunil: యో.. మంగళం శ్రీను.. సూపర్ స్టార్ కే విలన్ వా..?

Sunil

Sunil

Sunil: కమెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నాడు సునీల్.. ఆ తరువాత హీరోగా మారి చేతులు కాల్చుకున్నా త్వరగానే తేరుకున్నాడు. ప్రస్తుతం అన్ని పాత్రలు చేస్తూ నటుడిగా నిలబడ్డాడు. ముఖ్యంగా విలన్ గా సునీల్ బాగా రాణిస్తున్నాడు అని చెప్పొచ్చు. పుష్ప లో మంగళం శ్రీను విలనిజం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్స్ లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇదే గుర్తింపు తో సునీల్ ఇతర భాషల్లో కూడా విలన్ గా తన జోరు చూపించబోతున్నాడు.ఇక తాజాగా సునీల్ బంపర్ ఆఫర్ పట్టేశాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ లో మంచి ఛాన్స్ కొట్టేశాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

రజిని సినిమా అంటేనే ఒక వైబ్ వస్తోంది.. ఇక ఇందులో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా ఒక పాత్రలో నటిస్తున్నాడు అని తెలియడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ చిత్రంలో సునీల్ విలన్ గా నటిస్తున్నాడు అని తెలియడంతో మరింత క్రేజ్ వచ్చింది. నేడు సునీల్ జైలర్ సెట్ లో అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలుపుతూ సునీల్ లుక్ ను రిలీజ్ చేశారు. సునీల్ బ్యాక్ పోస్టర్ లో ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. లుక్ ను చూస్తుంటే మంగళం శ్రీను గుర్తుకు రాక మానడు. దీంతో సునీల్ విలన్ గానే కనిపిస్తున్నాడు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్టర్ పై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. యో.. మంగళం శ్రీను.. ‘జైలర్’ తో పనేందయ్యా అంటూ ఆట పట్టిస్తున్నారు.

Exit mobile version