Sundeep Kishan: ధమాకా డైరెక్టర్ తో సందీప్ కిషన్ కొత్త సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sundeep Kishan, Thrinadha Rao Nakkina #SK30 Announced: ‘ఊరు పేరు భైరవకోన’ బ్లాక్‌బస్టర్ విజయంతో మంచి జోష్ మీద ఉన్న హీరో సందీప్ కిషన్‌కి కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు లైన్ లో పెడుతున్నారు. ఇక అందులో భాగంగానే ఈ రోజు సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమాని అనౌన్స్ చేశారు. ‘ధమాకా’ వంటి భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఈ #SK30కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. సామజ వరగమన, ఊరు పేరు భైరవకోన వంటి వరుస హిట్‌ల తర్వాత, వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు ఈ రెండు ప్రొడక్షన్ హౌస్‌లు ఈ సినిమా కోసం మళ్లీ జతకట్టాయి. త్రినాధ రావు నక్కిన, ప్రసన్న కుమార్ బెజవాడ కాంబినేషన్ గతం నుంచి చాలా సక్సెస్ ఫుల్ అని చెప్పొచ్చు.
Ananya Nagalla: వేణుస్వామిని కలిసిన అనన్య.. పూజలా.. క్షుద్ర పూజలా?
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
వారు ఇద్దరూ కలిసి ధమాకాతో సహా అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించారు. ఇక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ కొత్త సినిమాకి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్‌లను అందిస్తున్నారు. రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విభిన్నమైన స్క్రిప్ట్‌లతో అలరించే సందీప్ కిషన్ #SK30 లో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నారని అంటున్నారు. గ్రాండ్ ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందించబడుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో త్రినాథరావు నక్కిన, ప్రసన్న కుమార్ ల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని, ఈ సినిమాకి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారని అంటున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..