Sundeep Kishan: సందీప్ కిషన్‌తో ‘శంబాల’ డైరెక్టర్ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘శంబాల’ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు మళ్లీ ఓ అద్భుతాన్ని సృష్టించేందుకు రెడీ అయ్యారు. ‘శంబాల’ తరువాత దర్శక, నిర్మాతలు కలిసి ఎటువంటి ప్రాజెక్ట్ చేస్తారా? అని అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఎదురుచూపుకి సమాధానంగా సందీప్ కిషన్‌తో ఓ భారీ పాన్ ఇండియా సోషియో ఫాంటసీ మూవీని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమా ప్రకటన కోసం ఓ క్రేజీ కాన్సెప్ట్ పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్‌లో ఒక సింహం, తోడేలు కనిపిస్తున్నాయి. యుద్ధభూమి బ్యాక్ గ్రౌండ్ లో సింహం, తోడేలు మధ్య ఒక పురాతన ఖడ్గం ప్రకాశిస్తూ అలా నిటారుగా నిల్చుని ఉంది. ‘కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు. కొంతమంది రాజులు ఎప్పటికీ మరణించరు’ అనే క్యాప్షన్ ఉంది.
Also Read : Chiranjeevi : ఫ్యామిలీతో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ చూసిన మెగాస్టార్
Also Read
- Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్‌పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
- Prasanna Kumar: టాలీవుడ్లో ముగిసిన యూనియన్ వార్.. రంగంలోకి దిగిన బాలయ్య!
- Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన వంగా.. 'స్పిరిట్' షూటింగ్‌పై క్రేజీ అప్డేట్!
- Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం దర్శక, నిర్మాతలు సక్సెస్ ఫుల్ హీరో సందీప్ కిషన్‌ను ఎంచుకున్నారు. ఈ సోషియో-ఫాంటసీ థ్రిల్లర్‌తో ఒక సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ఇది దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ కలిసి చేస్తున్న రెండో ప్రాజెక్ట్. ఈసారి సృజనాత్మక, సాంకేతిక ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ఈ సినిమాని రూపొందించేందుకు రెడీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇది సందీప్ కిషన్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఒక గొప్ప సినిమా అనుభూతిని అందించడానికి, నిర్మాతలు ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, కథనం విషయంలో అన్ని విధాలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 2026లో ప్రారంభం కానుందని నిర్మాతలు ప్రకటించారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!