NTV Telugu Site icon

Sundar C: తల్లి కాలేదని చెప్పారు.. ఇంకో పెళ్లి చేసుకోమంది.. ఎన్నో బాధలు పడ్డాం!

Khushboo

Khushboo

Sundar C about Struggles with Khushboo at Early days: తమిళ దర్శకుడు, నటుడు సుందర్ సి ‘అరణ్మనై 4′(తెలుగులో బాక్) తో ప్రక్షేకుల ముందుకు వచ్చాడు. మే 3న ప్రేక్షకుల ముందుకు రానున్న వచ్చిన ఈ సినిమాకి సుందర్‌ దర్శకత్వం వహిస్తూనే హీరోగా నటించాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుందర్ తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయాలు బయటపెట్టాడు. తమ కూతురు అవంతిక పుట్టకముందే ఇద్దరూ మానసికంగా ఎన్నో కష్టాలు పడ్డామని సుందర్ వెల్లడించారు. తన కుమార్తెతో ఉన్న పాత ఫోటో గురించి అడిగినప్పుడు ఆయన ఎమోషనల్ అయ్యాడు. సుందర్ మాట్లాడుతూ ”ఖుష్బు తన కూతురుకు జన్మనిచ్చిన కొన్ని క్షణాల తర్వాత తీసిన ఆ ఫొటోతో ఎమోషనల్‌గా చాలా అనుబంధం ఉంది. “ఇవి ఎవ్వరికీ చెప్పని విషయాలు.. పెళ్లికి ముందు కొంత కాలంగా ఖుష్బూ అస్వస్థతకు గురైంది.

Jason Sanjay: విజయ్ కొడుక్కి శంకర్ ఫ్యామిలీతో ఏం పని?

ఆమెకు ఎప్పటికీ బిడ్డ పుట్టదని డాక్టర్లు చెప్పారు.. ఈ విషయం తెలిసి నన్ను వేరే పెళ్లి చేసుకోమని కూడా చెప్పింది.. కానీ.. నేను ఆమెను వివాహం చేసుకుంటానని నాకు తెలుసు. కానీ దేవుని ద్వారా మాకు ఇద్దరు దేవదూతలు వచ్చారు. ఇక తన జీవితానికి సంబంధించిన ఫోటోను అభిమానులతో పంచుకోవడంపై ఖుష్బూ ఎలా స్పందించారని అడిగిన ప్రశ్నకు సుందర్ సమాధానమిస్తూ, ఆమె ప్రజలకు ప్రతిదీ చెబుతుంది, నేను ప్రైవేట్ వ్యక్తిని, ఆమె హైపర్యాక్టివ్. ఆమె నాకు పూర్తిగా ఆపోజిట్. ఇక ఒక పాయింట్ తర్వాత నేను కూడా అలాగే చేశాను. ఇప్పుడు నా జీవితమంతా తెరిచిన పుస్తక లాంటిదని సుందర్ అన్నారు. మురై మమన్ (1995) చిత్రీకరణ సమయంలో సుందర్ సి మరియు ఖుష్బూ ప్రేమలో పడ్డారు. వారిద్దరూ 2000లో పెళ్లి చేసుకున్నారు. ఖుష్బు చివరిగా తెలుగులో గోపీచంద్ రామబాణం చిత్రంలో నటించారు. నటనతో పాటు రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఆమె ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. ఇక బాక్ సినిమాలో ఒక పాటలో ఆమె కనిపించారు.