Suma Kanakala’s Festival For Joy (FFJ)’s new initiative with NATS: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల.. 2021లో సినీ ఇండస్ట్రీలో ఇబ్బందులు పడుతున్న మహిళలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను చేయటానికి ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అనే సేవా సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ సంస్థ సమాజ శ్రేయస్సులో తన వంతుగా భాగం అవుతోంది. ఇక ఇదే క్రమంలో సినీ ఇండస్ట్రీ కష్టసుఖాల్లో అండగా నిలుస్తూ ఎల్లప్పుడూ తన మద్ధతుని తెలియజేస్తోన్న తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ గురించి యాంకర్ సుమ నాట్స్ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) వారు వెంటనే స్పందించి సుమ కనకాల సేవా సంస్థ ఫెస్టివల్స్ ఫర్ జాయ్ ద్వారా టీఎఫ్‌జేఏకు రూ.5 లక్షల విరాళం అందించారు. నిజానికి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(TFJA).. సభ్యుల సంక్షేమం నిరంతరం కృషి చేస్తున్న సంఘం అని చెప్పక తప్పదు.
Best Web Series 2023: 2023లో ఆకట్టుకున్న వెబ్‌సిరీస్‌లు ఇవే.. అన్నీ చూశారా? చెక్ చేసుకోండి!
సంఘ సభ్యుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల బాగోగులను చూస్తూ ప్రతి సంఘ సభ్యుడికీ ఇంటి పెద్దలా అండగా నిలుస్తూ వస్తోంది టిఎఫ్‌జేఏ, ఇందులో చేరిన ప్రతి సభ్యుడి కుటుంబానికి రూ. 3 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యంతో పాటు ప్రతి సభ్యుడికి 15 లక్షలు టర్మ్ పాలసీ అలాగే 25 లక్షలు యాక్సిడెంటల్ పాలసీలు సైతం అందిస్తోంది. ఇందుకోసం పరిశ్రమ సహాయ సహకారాలతో పాటు అందరి సభ్యుల తోడ్పాటును తీసుకుంటూ వస్తోంది. ఇక NATS విరాళాన్ని సుమ కనకాలతెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వై.జె.రాంబాబు, ట్రెజరర్ నాయుడు సురేంద్ర కుమార్ సహా ఇతర అసోసియేషన్ సభ్యులు లకు అందచేశారు. ఇక నాట్స్ మెంబర్స్ శ్రీధర్ అప్పసాని, అరుణ గంటి, బాపు నూతి, ప్రశాంత్ పిన్నమనేనిలతో పాటు ఫెస్టివల్ ఫర్ జాయ్‌తో కలిసి వర్క్ చేస్తున్న నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజ్ అల్లాడకు టీఎఫ్‌జేఏ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు.