Site icon NTV Telugu

Gayatri Gupta : హీరోయిన్లు ఇష్టంతోనే శృంగారానికి ఒప్పుకుంటారు.. నటి షాకింగ్ కామెంట్స్

Gayatri Guptha

Gayatri Guptha

Gayatri Gupta : సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న పెద్ద భూతం. దానికి చాలా మంది బలైపోతున్నారు. కొందరు బయటకు వచ్చి తమకు జరిగిన ఘటనలు బయట పెడుతున్నారు. ఇదే క్రమంలో గాయత్రి గుప్త చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. లేదని ఎవరైనా చెబితే అది అబద్దం. ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను అంటూ తెలిపింది.

Read Also : Sukumar : రామ్ చరణ్‌ కోసం పనులు మొదలెట్టిన సుకుమార్

హీరోయిన్లు చాలా మంది ఇష్టంతోనే దర్శక, నిర్మాతలతో శృంగారానికి ఒప్పుకుని ఆఫర్స్ తెచ్చుకుంటారు. ఇంకొందరు ఇష్టం లేకపోయినా ఆఫర్స్ కోసం ఒప్పుకుంటారు. చాలా మంది అమాయక అమ్మాయిలు ఈ కాస్టింగ్ కౌచ్ లో బలైపోతున్నారు. అలాంటి వారికి దీని గురించి చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోవద్దు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఆఫర్స్ కోసం ఇదంతా కామన్ అయిపోయింది అంటూ చెప్పింది ఈ బ్యూటీ.

Read Also : Ranbir Kapoor: రణ్ బీర్ కపూర్ పై కేసు.. NHRC ఆదేశాలు

Exit mobile version