Site icon NTV Telugu

Sujeeth: ప్రభాస్ బ్లడ్ బాత్ షాట్.. డార్లింగ్ ఉంచావా..? తీసేశావా..? అని అడిగాడు

Sujeeth

Sujeeth

Sujeeth: రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ సుజీత్. కుర్ర డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే భారీ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆ హిట్ తోనే ప్రభాస్ తో సాహో లాంటి పాన్ ఇండియా సినిమా తీసే ఛాన్స్ పట్టేశాడు. సినిమా హిట్టా.. ఫట్టా అని పక్కన పెడితే.. సుజీత్ ఈ సినిమా కోసం పడిన కష్టం అంతాఇంతా కాదు. ఈ సినిమా ప్రభాస్ కు ఎంతో నచ్చిన సినిమా అని ఆయన చాలాసార్లు చెప్పుకొచ్చారు. అయితే బాహుబలి 2 తరువాత ఈ చిత్రం రావడంతో అభిమానులు అంచనాలు ఎక్కువగా పెట్టుకోవడంతో సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ఇక ఈ సినిమాను సుజీత్ చాలా సింపుల్ గా తీద్దామని అనుకున్నాడట.. అంతలోనే బాహుబలి 2 రిలీజ్ అవ్వడం.. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోవడంతో.. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తీయాలని చాలా మార్పులు చేసినట్లు అప్పట్లో టాక్ నడిచింది. ఇక ఈ సినిమా గురించి సుజీత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ మెమరీ పవర్ గురించి సుజిత్ మాట్లాడాడు.

King of Kotha: మలయాళ హీరో .. ఈసారి ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉన్నాడే

” సాహూ ఫస్ట్ నెరేషన్ సమయంలో ప్రభాస్ అన్నకు బ్లడ్ బాత్ షాట్ గురించి చెప్పాను. ఇక చాలా ఏళ్ల తర్వాత సాహో క్లైమాక్స్ షాట్ చిత్రీకరించినప్పుడు ఆ సీన్ మర్చిపోయాను. ప్రభాస్ అన్న నా దగ్గరకు వచ్చి “ఏంటీ డార్లింగ్.. బ్లడ్ షాట్ ఉందా.. తీసేశావా” అని అన్నాడు. అతని జ్ఞాపకశక్తికి నేను చాలా ఆశ్చర్యపోయాను” అని చెప్పుకొచ్చాడు. సాహో ప్రమోషన్స్ లో కూడా సుజీత్ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుజీత్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం సుజీత్.. పవన్ కళ్యాణ్ తో OG సినిమా చేస్తున్నాడు. ఇందులో కూడా పవన్ ను గ్యాంగ్ స్టర్ లానే చూపించనున్నాడు. మరి ఈ సినిమాతో సుజీత్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Exit mobile version