రిజల్ట్ తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలతో సినిమాలు చేసే హీరో సుధీర్ బాబు. పర్ఫెక్ట్ యాక్షన్ హీరోగా కనిపించే సుధీర్ బాబు, ప్రస్తుతం హరోం హర సినిమాతో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ కి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ సినిమా అనౌన్స్ చేసిన డేట్ ని రిలీజ్ కాలేదు. కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ ఎప్పుడు ప్రకటిస్తారు అనేది చూడాలి. హరోం హర సినిమాతో సుధీర్ బాబు హిట్ కొడతాడు అని సినీ అభిమానుల్లో నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సుధీర్ బాబు ఒక స్టార్ హీరో సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు అనే వార్త వినిపిస్తూనే ఉంది. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేస్తూ సుధీర్ బాబు ట్వీట్ చేసాడు.
అసలు విషయానికి వస్తే సుధీర్ బాబు… మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు విలన్ అనే మాట స్ప్రెడ్ అవ్వడంతో… సుధీర్ బాబు నటించట్లేదని క్లారిటీ ఇచ్చేసాడు. మిస్టర్ బచ్చన్ సినిమా హిందీ రైడ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇందులో విలన్ పాత్ర ఏజ్డ్ పర్సన్, ఇలాంటి క్యారెక్టర్ లో సుధీర్ బాబు నటిస్తున్నాడు అనుకోవడమే తప్పు. సో సుధీర్ బాబు దృష్టి అంతా ప్రస్తుతం హరోం హర ప్రమోషన్స్ పైనే ఉంది కానీ మిస్టర్ బచ్చన్ సినిమాలో విలన్ గా నటించట్లేదు.
Avuna ??? 🙄😬 https://t.co/8I948Um2xo
— Sudheer Babu (@isudheerbabu) January 25, 2024