Sudheer babu: కార్తీక సోమవారం ‘హరోం హర’ నినాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudheer babu: నైట్రో స్టార్ సుధీర్ బాబుతో జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. దీన్ని సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘సెహరి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన జ్ఞానసాగర్ ద్వారకు ఇది రెండో సినిమా కాగా, సుధీర్ బాబుకు 18వ చిత్రం.
‘అక్టోబర్ 31న మాస్ సంభవం’ అని ఇటీవల ప్రకటించిన చిత్ర బృందం అనుకున్నట్టుగానే ఈ రోజు బిగ్ అప్డేట్ తో వచ్చింది. ఈ చిత్రానికి ‘హరోం హర’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను లాక్ చేశారు. ‘ది రివోల్ట్’ అనే ట్యాగ్ లైన్ కూడా వుంది. టైటిల్ ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ, ట్యాగ్‌లైన్ కథలోని ప్రతీకార కోణాన్ని తెలియజేస్తోంది. కాన్సెప్చువల్ టైటిల్ వీడియోలో సినిమా సెట్టింగ్, బ్యాక్‌డ్రాప్, గ్రాండ్ స్కేల్ చూస్తుంటే మూవీ వైవిధ్యంతో తెరకెక్కబోతోందని అర్థమౌతోంది.. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి కథ ఇది. సుబ్రమణ్య స్వామి ఆలయం, జగదాంబ టాకీస్, రైల్వే స్టేషన్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలు వీడియోలో చూపించారు. ఈ వీడియో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో సుధీర్ బాబుని ప్రజంట్ చేసింది. “ఇంగా సెప్పేదేం లేదు… సేసేదే…” అని సుధీర్ బాబును చిత్తూరు యాసలో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. టైటిల్ వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. చివర్లో సుధీర్ బాబు మాస్ గెటప్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఈ సినిమా కోసం సుధీర్ బాబు కంప్లీట్ గా మేకోవర్ అయ్యానట్టు అనిపిస్తోంది. యానిమేటర్ వేణుమాధవ్ పిక్చర్స్ ను, చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ఎలివేట్ చేసింది. ఈ చిత్రానికి అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, రమేష్ కుమార్ జి సమర్పిస్తున్నారు.
Also Read
- Pawan Kalyan : నాకు సూపర్ స్టార్ డమ్ ఉంది... ఇప్పటికీ 'OG' లాంటి సినిమాలు చేయగలను
- Ranveer Singh: కెరీర్ పీక్స్‌లో ఉండగానే షాక్.. ‘ధురంధర్’ హీరోపై బ్యాన్.. అసలు మ్యాటర్ ఇదే!
- Tamil Cinema : కోలీవుడ్ కోసం విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. వాటన్నిటికి ఇక గ్రీన్ సిగ్నల్
- Peddi : 'పెద్ది' ఐటం సాంగ్.. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది
‘హరోం హర’ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.
తాజావార్తలు
-
Hyderabad: కంత్రీగాడి తాటతీసిన పోలీసులు.. వీడిన నార్సింగ్ మహిళపై వేధింపుల కేసు
-
OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
-
Zepto: దలాల్ స్ట్రీట్‌లో క్విక్ కామర్స్ జాతర.. రూ.11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో రెడీ!
-
Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
-
K Pajanivel: పద్మశ్రీ పురస్కారం స్వీకరించే ముందు.. ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారం.. కె. పజనివేల్ ఎవరు?
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?